Global Investors' Summit: హై సెక్యూరిటీ జోన్‌గా మారిపోయిన విశాఖ.. ట్రాఫిక్ ఆంక్షలు
Global Investors' Summit: ఆంప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం..
ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి.. నిన్న ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000 కిపైగా నమోదు కావడం గమనార్హం.
దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు.
![]()
మార్చి 3న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశాల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొనబోతున్నారు..




















Mar 02 2023, 12:25
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
51.8k