పిట్టంపల్లి, చిన్నకాపర్తి గ్రామాల్లో నిన్న రాత్రి జరిగిన ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమం
ముఖ్య అతిథులుగా
•భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి వేదాంతం గోపీనాథ్,
•బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు,
•చిట్యాల మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ లు
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం పిట్టంపల్లి మరియు చిన్నకాపర్తి గ్రామాల్లో నిన్న రాత్రి జరిగిన ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి వేదాంతం గోపీనాథ్ , బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు, చిట్యాల మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ లు పాల్గొని మాట్లాడారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 350 కి పైగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని ఢిల్లీలో విడుదలైన బడ్జెట్ ను సరాసరి గ్రామపంచాయతీ ఖాతాలో పడేవిధంగా 14వ 15వ ఆర్థిక సంఘాల ద్వారా నిధులు ఏర్పాటు చేశారని
ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో స్వచ్ఛభారత్, మంచినీటి పథకాలు, మరుగుదొడ్లు, వైకుంఠధామాలు, రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు వ్యవసాయం ఎరువుల సబ్సిడీ, రేషన్ బియ్యం, ఆడబిడ్డలకు సుకన్య సమృద్ధి యోజన, రైతులకు ఫసల్ బీమా యోజన, పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్, ఇల్లు లేని పేద వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలా 350 పైగా పథకాలు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు.
ఇట్టి పథకాలను తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నిరంకుశ పాలనలో నరేంద్ర మోడీ గారి పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కేసీఆర్ దొర అరాచక పాలనను అంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీని బొంద పెడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆనాడు ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణను మోసం చేస్తున్నారని తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని తెలంగాణ ఉద్యమం చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ 1200 మందికి పైగా విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo ఏర్పడిందని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఒక కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితమైందని ఉద్యమకారులను ఆగం చేసిన కేసీఆర్ కుటుంబం సర్వనాశనమైతుందని,
తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా ఆగం చేసిన కేసీఆర్ ను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యమకారులను మోసం చేసి పబ్బం గడుపుతున్న కెసిఆర్ కుటుంబం నిరంకుశ పాలన ఇక కొనసాగడానికి వీలులేదని, పేద ప్రజలకు ఉండడానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేక అవస్థలు పడుతుంటే కేసీఆర్ దొర వారి కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్ లు వందల ఎకరాల్లో నిర్మించుకొని తెలంగాణ సొమ్మును దోచుకుని దాసుకుంటుంరని, తెలంగాణలో ఉన్న సంపద మొత్తం దోసుకొని లిక్కర్ స్కాములు, సాండ్ స్కాములు, ల్యాండ్ స్కాములు అన్ని రకాల స్కాములు చేసి ఇప్పుడు మల్ల సామాన్య ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎక్కడ తన కూతురు కవిత అరెస్టు అయితదని ముందస్తుగా
పార్టీ శ్రేణులకు అరాచకాలు సృష్టించే విధంగా పన్నాగాలు పన్నుతున్నారని దొంగ ఎప్పుడైనా దొంగే అని ప్రజలు గమనించాలని, కెసిఆర్ కు ఎలక్షన్లు వచ్చినప్పుడే దళిత బంధు, గిరిజన బంధు గుర్తుకొస్తాయని తెలంగాణ రాష్ట్రంలో దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు కేసీఆర్ కంటికి కనబడడం లేదని వాళ్ళ అభివృద్ధిని ఏనాడు కూడా ఆకాంక్షించలేదని కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజలను ప్రాంతాలుగా కులాలుగా మతాలుగా విభజించి పాలిస్తున్నారని తెలంగాణ ప్రజల గోస వినడానికి భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామానికి వెళ్లి ఈ యొక్క బిజెపి భరోసా కార్యక్రమాలని పదకొండు వేల కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి విజయవంతం చేశారన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాల వల్ల తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈసారి తప్పకుండా తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని విశ్వసనీయతో ప్రజలు ఉంటారని తెలియజేశారు.
తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్య ఉచిత వైద్యం వెంటనే అమలు చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు తెలియజేశారు అన్నారు. ఈ యొక్క ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమాలను విజయవంతం చేసిన తెలంగాణ యావత్ ప్రజానీకానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ నాగాచారి బూత్ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, జనార్ధన్, పొలిమేర రాము, శ్రవణ్, బిజేపి నాయకులు ప్రభాకర్, కృష్ణయ్య, నరసింహ, వెంకన్న, సత్తయ్య, వెంకటేశం, మురళి, రవి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Mar 01 2023, 18:08