శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ జాషువా*
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ జాషువా

కృష్ణా జిల్లా
గన్నవరం నియోజకవర్గ పరిధిలో నిన్న జరిగిన టిడిపి వైసిపి శ్రేణులు మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఈరోజు టిడిపి శ్రేణులు చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసువారి అనుమతులు లేవు.

తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి, విధులు నిర్వహిస్తున్న పోలీసులు మీద దాడికి పురి గొల్పడం బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైంది.దీనివల్ల విధులు నిర్వహిస్తున్న గన్నవరం సిఐ కనకారావు తలకు బలమైన గాయమైంది.
పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది.
తెలుగు దేశం పార్టీ ఆఫీసు పై జరిగిన దాడి కి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం.
సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది.
చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు.
గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉంది.
ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు మొదలగునవి నిర్వహించరాదు.
గన్నవరం పరిసర ప్రాంతాలకు
ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్ట్ లు, పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించవలసినదిగా జిల్లా ఎస్పీ జాషువా ఐపీఎస్ పత్రిక ముఖంగా తెలియజేశారు.
Feb 23 2023, 10:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.0k