పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి


బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్, ఆర్ బి న్యూస్ మండల్ రిపోర్టర్ ఉప్పుల రవి కిరణ్ 

 సాంబమూర్తి దేవాలయంలో మహా శివరాత్రి సంద్భంగా ప్రత్యేక పూజలు చేసిన మహేందర్ గౌడ్, ఉప్పుల రవి కిరణ్

పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ కేసరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సాంబమూర్తి దేవాలయంలో మహేందర్ గౌడ్, ఆర్ బి న్యూస్ మొగుళ్ళపల్లి మండల రిపోర్టర్ ఉప్పుల రవి కిరణ్ లు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్, ఉప్పుల రవి కిరణ్ లు మాట్లాడుతూ.. మహామహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ భక్తి, శ్రద్ధలతో ఉపవాసం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. ఆ పరమ శివుని కటాక్షాలు ప్రతి ఒక్కరిపై వుండాలని, ప్రజలందరూ సుఖ, సంతోషాలతో జీవించాలని కోరారు. ఆ ఆది దేవుని తత్వం నేటికీ ఓ జీవన మార్గమని, నీవే దిక్కు అంటే చాలు..కరిగే అల్ప సంతోషి శివుడు అని, పార్వతికి తన అర్ధ భాగాన్నిచ్చి అర్ధనారీశ్వరుడిగా ప్రఖ్యాతి గాంచారని, రాక్షసులకు సైతం వరాలు ఇచ్చే భోళాతనం శివుని సొంతమని, శ్రీవాదాన్ని చాటిన ఆదిదేవుడు శివుడని, ఆ శివపార్వతులు జగతికి తల్లిదండ్రులని..వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆరోగ్యవంతమైన జీవితంలో గడపాలని ఆకాంక్షించారు.

బీజేపీ హాయంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం - ఆదానీకి అండగా మోడీ

సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ప్రెస్ మీట్ పాయింట్స్

బీజేపీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం

ఆదానీకి అండగా మోడీ

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ ఏం అభివృద్ధి చేసాడు 

డబుల్ బెడ్ రూం లు పంపిణీ చేయకపోతే పేదలచే ఆక్రమిస్తాం

సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

 Street Buzz news కరీంనగర్ జిల్లా:

(కరీంనగర్ ):- కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం తో పాటు ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నదని, ఆదానీకి అండగా మోడీ ఉన్నారని,లక్షల కోట్ల సంపదను ధారాదత్తం చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫి చేస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని,పేదలు,రైతులు బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు చెల్లించకపోతే మాత్రం వారి వద్ద వసూలు చేస్తారని రానున్న రోజుల్లో మోడీ కి తగిన గుణపాఠం చెప్పాలని,ఆదానీ స్టాక్స్ వ్యవహారం పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని వెంకటస్వామి డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ అయిన బి.బి.సి కార్యాలయం పై ఐటీ దాడులు చేయడం వెనుక మోడీ ప్రభుత్వ హస్తం ఉందని,ప్రజల సమస్యలను,ప్రభుత్వ అవినీతిని బయటకు తెస్తున్న పత్రికలపై, మీడియా పై పాలక ప్రభుత్వాలు కష్ట సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల స్వేచ్ఛను హరిస్తున్న పాలకులపై ప్రజలు తిరగబడి పోరాడాలని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని తను ఎన్నికై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా నియోజక వర్గానికి కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చి ఏమి అభివృద్ధి సాధించారో ప్రజలకు వివరించాలని, నిత్యం రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శించడమే పనిగట్టుకొని రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తూ జైశ్రీరామ్,భారత్ మాతాకీ జై అంటూ యువతరాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని వెంకటస్వామి ఆరోపించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా తన మాటల గారడీతో కాలయాపన చేస్తున్నాడని,రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని చేయకపోవడం బాధాకరమని పోడు భూములపై సీపీఐ గత అనేక సంవత్సరాలుగా పోరాడుతుందని, భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు,పేదవారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు నిర్వహించిందని ముఖ్యమంత్రి మాత్రం పోడు భూముల సాగుదారులపై ఆంక్షలు విధిస్తూ పోరాటాల నిర్వహించిన వారిని చులకన చేసి మాట్లాడడం సరైనది కాదని, దేవాలయాలకు వందల కోట్ల రూపాయలు ప్రకటించడం మాకేం అభ్యంతరం కాదు కానీ కనీసం ఉండడానికి ఇల్లు లేని,ఇంటి స్థలం లేని నిరుపేదలు అనేకమంది ఉన్నారని వారికి నీడ కల్పించాలనే ధ్యాస లేకపోవడం బాధాకరమని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి యేండ్లు గడుస్తున్నా వాటిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదని శివరాత్రి తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన పేదలకు కేటాయించకపోతే నిరుపేదలందరినీ ఏకం చేసి సీపీఐ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలచే ఆక్రమిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి వెంకటస్వామి హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి,జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్ కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,పైడిపెల్లి రాజు,కిన్నెర మల్లవ్వ, బ్రామండ్ల పెల్లి యుగేందర్, బోనగిరి మహేందర్ పాల్గొన్నారు.

అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఏటిడిఓ ఇంచార్జీ డిటిడిఓ ను ఉద్యోగం నుంచి తొలగించాలి

 అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నిర్మల్ ఏటిడిఓ ఇంచార్జి డిటిడిఓ శ్రీనివాస్ రెడ్డిని ఉద్యోగం నుండి తొలగించాలి 

 పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచాలి 

గత జూన్ నుండి హాస్టల్ లో పెట్టుబడి పెట్టిన హాస్టల్ వార్డెన్ లకు హెడ్ మాస్టర్ లకు బడ్జెట్ కేటాయించి బిల్లులు చెల్లీంచాలి 

 టెండర్ లు వేసి హాస్టల్ కు సామాగ్రి సప్లైయి చేయాలి 

 లేని ఏడల ఆందోళన చేస్తామని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ 

Street Buzz news నిర్మల్ జిల్లా:

(దస్తురాబాద్):- తెలంగాణ ఎస్ సి, ఎస్ టి, బిసి మైనారిటి విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆధ్యక్షులు వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా ఆధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ గిరిజన ఆశ్రమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ఆకస్మాత్తుగా నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల్ మల్లపూర్ లో గల బాలుర హాస్టల్ కు వెళ్లి వారితో మాట్లాడారు. మరియు హెచ్ ఎం కమ్ వార్డెన్ గారితో వారి వారి సమస్యలు తెలుసుకున్నారు. భోజనం సమయం కావడం వలన విద్యార్థులకు పెట్టే భోజనం విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ భోజనం చేశారు. విద్యార్థులకు పెట్టె భోజనం రోజు వారి మెను ప్రకారం పెట్టడం జరిగింది. విద్యార్థులు కూడ ఎప్పుడు ఇదే విదంగా వంట చేస్తారని వారితో చెప్పారు. మెను ప్రకారం భోజనం పెట్టడం వలన విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మరియు టెండర్ వేయకుండా విద్యార్థులకు మెను ప్రకారం భోజనం పెట్టకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గవ్వల శ్రీకాంత్ హెచ్చరించారు. మరియు నిర్మల్ ఎటిడీఓ ఇంచార్జి డిటిడీఓ శ్రీనివాస్ రెడ్డి హాస్టల్లలో పరివేక్షణ చేయకుండా ప్రతి రోజు రాత్రి పగలు తేడా లేకుండ తప్ప తాగి డ్యూటీ చేస్తూ ఆఫీస్ కు వస్తూ కింది అధికారులను నోటికి వచ్చినట్లు బూతులు తిడుతు ప్రతి నెల ఒక విద్యార్థికి కమిషన్ లాగా పది శాతం లంచం ఇవ్వాలని మరియు కనీసం నెలకు ఒక హాస్టల్ నుండి పది వేలు తగ్గకుండ ఇవ్వాలని డిటిడీఓ శ్రీనివాస్ రెడ్డి వార్డెన్ లను హెచ్ ఎం లను వేధింపులకు గురిచేస్తే డిటిడీఓ శ్రీనివాస్ రెడ్డి వలన మానసిక ఒత్తిడి తట్టుకోలేక పెట్టిన పెట్టుబడి బిల్లులు రాక ఇద్దరు అధికారులు అనగా పీజి హెచ్ ఎం సుభాష్ హాస్టల్ వార్డెన్ పి నారాయణ ఇద్దరు మృతి చెందినారని కావున ఈ అధికారి పై ఉన్నత అధికారులతో విచారణ జరిపించి అవసరమైతే శ్రీనివాస్ రెడ్డి పై హత్యనేరం కేసు పెట్టాలని ఉద్యోగం నుండి తొలగించాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.అదేవిదంగా కొంత మంది వార్డెన్ లు హెచ్ ఎం లు కూడ వర్కర్లను విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు గవ్వల శ్రీకాంత్ తెలిపారు. వార్డెన్ లు హెచ్ ఎం లు వారి పద్ధతులు మార్చుకోవాలని కోరారు. డిటిడీఓ శ్రీనివాస్ రెడ్డి పై ట్రైబల్ వేల్పర్ కమిషనర్ గారికి ప్రిన్సిపాల్ సెక్రెటరీ గారికి సెక్రెటరీ గారికి జిల్లా కలెక్టర్ గారికి పిఓ గారికి గిరిజన శాఖ మంత్రి గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సీ ఎం గారికి వినతి పత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా పంపి త్వరలో కలిసి వినతి పత్రాలు ఇస్తున్నట్లు గవ్వల శ్రీకాంత్ తెలిపారు.

మాముళ్ళ మత్తు వదలని అధికారులు - యధేచ్చగా అక్రమ ఇసుక రవాణా


 పేదోడి ఇంటికి ఇసుక కరువు..కమర్షియల్ భవనానికి అక్రమంగా ఇసుక తరలింపు  

 నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు

 ట్రాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ రైతుల వేడుకోలు

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ;(మొగుళ్ళపల్లి):- మండలంలోని ఒక గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధి తన గ్రామ సరిహద్దుల్లో ఉన్న కమర్షియల్ భవన నిర్మాణానికి అన్ని తానై వ్యవహరిస్తూ గత కొన్ని రోజుల నుండి మండలంలోని సమీప గ్రామాలకు చెందిన వాగుల నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా యథేచ్చగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడు. గత పది రోజుల నుండి గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా, పలు పత్రికలలో వార్తలు ప్రచురితమైన కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో అధికారుల అండదండలు నాకు ఉన్నాయంటూ గురువారం కూడా సమీప గ్రామాల నుండి కమర్షియల్ భవనానికి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు. ఇప్పటికైనా టాస్క్ ఫోర్స్ బృందాలతో విచారణ చేపట్టి.. కమర్షియల్ భవన నిర్మాణం వద్ద ఉన్న ఇసుక డంప్ లను సీజ్ చేసి, ఆ ప్రజాప్రతినిధిపై చట్టరీత్యా చర్యలు తీసుకోని, అక్రమ ఇసుక రవాణాను ఆపాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిర్లక్ష్యం


●RSP సిద్దిపేట జిల్లా నాయకులు గడిపే సుజిత్ ●

Street Buzz news సిద్దిపేట జిల్లా:: ;(హుస్నాబాద్ ):- హుస్నాబాద్ ఎమ్మెల్యే  వొడితల సతీష్ కుమార్ నిర్లక్ష్యం వల్ల పేదలకు చెందవలసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఈరోజు డబ్బులకు ఇచ్చిన వారికి చెందుతున్నాయని RSP పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రివలేషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకుడు గడిపే సుజిత్ కుమార్ మండిపడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వార్డ్ బిఆర్ఎస్ నాయకులు డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని అని చెప్పడం సిగ్గుచేటని మండి పడ్డారు. వెంటనే పేదలకు కట్టిన డబుల్ బెడ్ రూమ్ లను అన్నింటిని అర్హులైన పేదలకు ఇవ్వాలని అన్నారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల నాయకులు మధురవేణి అజయ్ ,సాయి నరేష్, దుర్ముట్ల శివ,చందు,గద్ద శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విమాన రాకపోకల సమయాలు ఇవే

Street Buzz news కడప:  

కడప విమాన సర్వీసులు,కడప వయా హైదరాబాద్‌ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, రాజమండ్రి, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర్‌, వారణాసి, జైపూర్‌, సూరత్‌, రాంచీ, ఢిల్లీ

కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, మైసూరు

కడప వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్‌, హుబ్లీ, లక్నోలకు

విమానం వచ్చి.. వెళ్లే సమయం

చెన్నై-కడప : 08.05 - 09.20

కడప-చెన్నై : 14.00 - 15.20

కడప-విజయవాడ : 09.45 - 11.00

విజయవాడ-కడప : 11.45 - 13.20

బెంగళూరు-కడప : 09.25 - 10.30

కడప-బెంగళూరు : 15.10 - 16.15

కడప-విశాఖపట్నం : 10.50 - 12.40

విశాఖపట్నం-కడప : 13.00 - 14.50

హైదరాబాద్‌-కడప : 09.45 - 11.05

కడప-హైదరాబాద్‌ : 11.35 - 13.05

విమానాల రాకపోకలు ఇవే...

కడప-హైదరాబాద్‌ : ప్రతిరోజు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

కడప-విజయవాడ-కడప : సోమ, బుధ, శుక్ర, ఆదివారం

చెన్నై-కడప-చె న్నై : సోమ, బుధ, శుక్ర, ఆదివారం

బెంగళూరు-కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం

కడప-విశాఖపట్నం-కడప : మంగళ, గురు, శనివారం

సర్వీసులను ఉపయోగించుకోండి

- శివప్రసాద్‌, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్

 -- ఆకాశయానం ✈️✈️✈️

సోము వీర్రాజు ప్రవర్తన నచ్చకే భాజాపాకు రాజీనామా - కన్నా

Street Buzz news గుంటూరు:- 

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై భాజపా(BJP)లో చేరానని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు..

చేరినప్పటి నుంచి సామాన్య కార్యకర్తగా పనిచేశానని.. దాన్ని గుర్తించే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. 

అయితే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) ప్రవర్తన బాగాలేకనే భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 

అయితే మోదీపై ఉన్న అభిమానం ఎప్పటికీ చెక్కుచెదరని చెప్పారు. 

త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. 

గుంటూరులో ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు..

''2014లో భాజపాలో చేరా. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వచ్చా. 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. 

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి 2019 ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించా. 

2024 ఎన్నికల్లో ఏపీలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశా. 

సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశా. 

ప్రజల తరఫున అనేక సమస్యలపై పోరాడా. 

కరోనా తర్వాత నన్ను మార్చి సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేశారు. 

ఆయన ప్రవర్తన నచ్చకే రాజీనామా చేశా. 

స్థానిక నాయకుల వైఖరి కారణంగా పార్టీలో మనుగడ సాగించలేను. 

నాతో పాటు రాజీనామా చేసిన మిత్రులకు ధన్యవాదాలు'' అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

వంద రూపాయల కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మవేయడం తెలుగుజాతికి దక్కిన గౌరవం


◆యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి◆

Street Buzz news పెద్దపల్లి జిల్లా:

(రామగుండం):- గోదావరిఖని ఫిబ్రవరి 16 :- ఆంధ్రుల ఆరాధ్యదైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుగారి బొమ్మతో వందరూపాయల వెండి నాణెం ముద్రణకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి హర్షం వ్యక్తం చేశారు. ఓవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాల్లో రాణించి, పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహానటుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు, ప్రతి పౌరాణిక పాత్రకు సజీవ రూపంగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్ అని అన్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయనే చిరునామా అని అదేవిధంగా రాజకీయాల్లో చిరస్మరణీయుడు అని పేర్కొన్నారు. ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా జనం గుండెల్లో సజీవంగానే ఉన్నారు అని అటు సినీ రంగంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్, రాజకీయరంగంలో ఇంకెవ్వరికీ సాధ్యం కానీ విధంగా చరిత్ర సృష్టించారు అని తెలిపారు. తెలుగోడి ఆత్మగౌరవం నినాదంతో 1982 పసుపు జెండాను ఎగురవేశారు అని తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీని ప్రకటించి 9 నెలలు తిరగకుండానే ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు అని అన్నారు. ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు అని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం తెలుగు ప్రజలకు శుభవార్త అందించి ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణాన్ని త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రకటిండాన్ని యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి నందమూరి సేవా సమితి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇదే సందర్భంలో నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలి అని కోరారు.

టి,ఎస్,జే,ఏ కోదాడ పట్టణ అధ్యక్షుడిగా మహమ్మద్ మజార్ నియామకం

Street Buzz news సూర్యాపేట జిల్లా :

కోదాడ(టౌన్ న్యూస్ ):- తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ కోదాడ పట్టణ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ మజార్ నియమించారు.ఈ మేరకు గురువారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు మజార్ నియమిస్తూ ప్రకటన చేశారు.ఈ సందర్భంగా మజార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు

దస్తురాబాద్ ఎస్.ఐ ని మర్యాద పూర్వకంగా కలసిన విబిఏ జిల్లా అద్యక్షులు

దస్తురాబాద్ ఎస్.ఐ బి. ప్రకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన విబిఏ జిల్లా ఆధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ 

Street Buzz news నిర్మల్ జిల్లా: 

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ ఎస్.ఐ గా బి ప్రభాకర్ రెడ్డి పదవిబాద్యతలు చేపట్టగా వారిని మర్యాదపూర్వకంగా వంచిత్ బహుజన్ ఆఘాడి విబిఏ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ ఎస్ సి, ఎస్ టి బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ కలిసి అభినందనలు తెలియజేశారు.గత పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఏది ఏమైన శాంతి భద్రతల పట్ల కఠినంగా ఉండాలని చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు మంచి చేయాలని ఎస్.ఐ బి.ప్రబాకర్ రెడ్డి అన్నారు.