madagoni surendar

Feb 16 2023, 20:25

విజయవంతంగా పోలీస్ దేహదారుడ్య పరీక్షలు*

విజయవంతంగా పోలీస్ దేహదారుడ్య పరీక్షలు

Streetbuzz news : నల్గొండ జిల్లా :

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహిస్తున్న 

మహిళా కానిస్టేబుల్,ఎస్సై 

దేహదారుఢ్య పరీక్షలు రెండవ రోజు గురువారం విజయవంతంగా పూర్తి అయ్యాయి.ఇందులో 1012 మంది అభ్యర్థులకు గాను 327 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

ఈ దేహదారుఢ్య పరీక్షలను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి డాక్టర్ పి.శబరీష్ ఐపిఎస్ పర్యవేక్షణలో జరుగాయి.మొత్తం 1012 మంది అభ్యర్థులకు గాను, 797 అభ్యర్థులు హాజరు కాగా,వీరిలో 327 మంది అభ్యర్థులు (ఫిజికల్ టెస్ట్లు) దేహదారుఢ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు.215 మంది అభ్యర్థులు గైరాజరయ్యారు.

madagoni surendar

Feb 16 2023, 20:21

అప్రకటిత విద్యుత్ కోతలు నివారించాలి: ప్రజాపంథా*

అప్రకటిత విద్యుత్ కోతలు నివారించాలి: ప్రజాపంథా

  

Streetbuzz news :నల్గొండ జిల్లా :

సూర్యాపేట జిల్లా:   సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అప్రకటిత విద్యుత్ కోతలు నివారించాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యుత్ ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్టనాయకులు మట్టపల్లి అంజయ్య,

పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి అప్రకటిత కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతుల నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా కేసీఆర్ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తానని ప్రగల్భాలు పలికి అప్రకటిత కరెంటు కోతలు విధిస్తూ అన్నదాతలను

ఆగం పటిస్తిండని మండిపడ్డారు.కరెంటు ఎప్పుడు ఉంటుందో ఉండదో తెలియక రైతులు సతమతవుతుంటే అసెంబ్లీలో మాత్రం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.ఇప్పటికే అనేక చోట్ల పంటలు ఎండిపోయి రైతులు నిరాశకు గురవుతున్నా, రైతులను పట్టించుకొనే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు.ఇకనైనా రైతులు నష్టపోకముందే కరెంట్ సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రైతులతో కలిసి రాష్ర్ట వ్యాప్తంగా కరెంటు ఆఫీస్ లు ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ,పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి,ప్రజాపంథా పట్టణ కార్యదర్శి గులాంహుస్సేన్, జీవన్,వాజిద్,నగేష్,బావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 16 2023, 20:05

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి...!*

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి...! 

Streetbuzz news :నల్గొండ జిల్లా :

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద

గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తేజ ఫుడ్ ఇండస్ట్రీస్ కి మహిళా కూలీలతో వెళ్తున్న ఆటోను,అదే సంస్థకు చెందిన బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన ఏడుగురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలిస్తుండగా పరిస్థితి విషమించి శిరీష,ధనలక్ష్మి, నాగలక్ష్మి,అనసూయ అనే

నలుగురు మహిళా కూలీలు మృత్యువాత పడగా,ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్ర పొందుతున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఓకే గ్రామానికి చెందిన నలుగురు మహిళలు మృతి చెందడంతో 

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో విషాదఛాయలు అలుముకున్నాయి.

madagoni surendar

Feb 16 2023, 12:18

సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*

సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Streetbuzz news :నల్గొండ జిల్లా :

సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.గురువారం నకిరేకల్ మండలం గొల్లగూడెం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భౌతికంగా చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు ప్రసాదించడానికి చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు.మానవ శరీరం లో అన్నిటి కంటే  ప్రధానమని తెలిసి కూడా కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ శాశ్వతం గా చూపు కోల్పోతున్న లక్షలాది మంది ని చైతన్య పరిచే,అదుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి పుట్టినదే కంటి వెలుగు కార్యక్రమం అని అని ఆయన అన్నారు. తెలంగాణ లో కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దేశం మొత్తానికి వెలుగు నిస్తుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో. నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినగేష్,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 16 2023, 12:04

హైదరాబాద్ కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి*

హైదరాబాద్ కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి

Streetbuzz news : నల్గొండ జిల్లా :

పంజాబ్ సీఎం భగవత్ మాన్ ఈరోజు ఉదయం సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో పర్యటించనున్నారు.

అలాగే కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ మల్లన్న సాగర్ రిజర్వాయర్ లను సందర్శిస్తారు. తర్వాత హైదరాబాద్ చేరుకొని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో. సమావేశమై ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకుంటారు. నిన్న రాత్రి నగరానికి చేరుకున్న ఆయన. కెసిఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు..

madagoni surendar

Feb 15 2023, 14:16

Ts.ప్రాథమిక రాత పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోయినా న్యాయస్థానం ఉత్తర్వులతో పలువురు ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి అభ్యర్థులకు మళ్లీ అవకాశం.

హైదరాబాద్‌: ప్రాథమిక రాత పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేకపోయినా న్యాయస్థానం ఉత్తర్వులతో పలువురు ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి అభ్యర్థులకు మళ్లీ కొలువు దక్కించుకునే పోటీలో నిలిచే అవకాశం చిక్కింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 52 వేల మందికి పైగా అభ్యర్థులు ఉండడం విశేషం. వీరంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వీరికి శారీరక సామర్థ్య పరీక్షలు జరగబోతున్నాయి. తొలిసారిగా డిసెంబరు 8 నుంచి 31 వరకు జరిగాయి. కనిష్ఠంగా 9 రోజులు, గరిష్ఠంగా 24 రోజులపాటు వీటిని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌తో పాటు సిద్దిపేటలో ఇవి జరిగాయి. అప్పటికే ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07లక్షల మందికి అప్పట్లో ఈ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మాత్రం కొన్ని కేంద్రాల్ని తగ్గించారు. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్‌, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఏర్పాట్లు పూర్తి చేసింది.

తొలుత తొలగించి.. తర్వాత కలపడంతో.. 

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ గతేడాది ఆగస్టులో 16,875 పోస్టుల కోసం నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్షలకు సుమారు 8.5 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే 60 మార్కులు రావాలని నిర్ణయించారు. కాగా ఈ పరీక్షలో 8 తప్పులు దొర్లాయి. వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించి అందుకు అనుగుణంగానే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఫలితాల్ని విడుదల చేసింది. అప్పట్లో 2.07లక్షల మంది అర్హులుగా తేలడంతో వారికి శారీరక సామర్థ్య పరీక్షల్ని నిర్వహించి తుది రాతపరీక్షలకు ఎంపిక చేసింది. మార్చిలో ఆ పరీక్షలను జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రాథమిక రాతపరీక్షలో తప్పులు దొర్లిన ప్రశ్నలను తొలగించకుండా వాటికీ మార్కుల్ని కలపాలనే డిమాండ్‌ మొదలైంది. ఇదే విషయమై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన న్యాయస్థానం మార్కుల్ని కలపాలంటూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 8 మార్కుల్ని కలపడంతో తాజాగా 52 వేల మంది అదనంగా అర్హత సాధించారు.

madagoni surendar

Feb 15 2023, 12:58

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి హర్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు అయింది

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి హర్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు అయింది

Streetbuzz news :నల్గొండ జిల్లా :

యాదగిరిగుట్ట; యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల 21 మాఘ శుద్ధ పాడ్యమిన స్వస్తివాచనం, అంకురారోపణం, విష్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 3 వరకు అత్యంత వైభవోపేతంగా సాగే వేడుకల్లో 27న ఎదుర్కోలు, 28న స్వామివారి తిరుకల్యాణోత్సవం, మార్చి ఒకటిన దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. నాలుగు రోజులపాటు అలంకార సేవలు చేపట్టనున్నారు. కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్‌ సంకల్పంతో రూ. 1,250 కోట్లతో మహాద్భుతంగా రూపుదిద్దుకున్న ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం వస్తున్న తొలి బ్రహ్మోత్సవాలు అవడంతో కనీవినిఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓరామకృష్ణారావు తెలిపారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. కల్యాణోత్సవాన్ని గతంలో మాదిరి కాకుండా ఈసారి కొండపైన తిరుమాఢవీధుల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 10 వేల మంది భక్తులు కూర్చుని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరించారు.

కొండపైనే స్వామివారి తిరు కల్యాణం 

ప్రధానాలయం ప్రాంగణంలోనే స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం చేపట్టనున్నారు. ప్రధానాలయం ఉత్తర ప్రాంతంలోని వాయుదిశలో నిర్మించిన లిఫ్ట్‌, రథశాల ప్రాంతంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 28న రాత్రి 8 గంటలకు తిరు కల్యాణోత్సవం జరుపనుండగా అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకారం(హనుమంత సేవ), రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ నిర్వహించనున్నారు. ఇందుకోసం 56 ఫీట్ల పొడవు, 28 ఫీట్ల వెడల్పుతో ప్రత్యేక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణ మండపం ఎదురుగా ఉత్తర మాఢ వీధుల్లో 10 వేల మంది భక్తులు కూర్చునే విధంగా వసతులు కల్పించనున్నారు. వీవీఐపీ, వీఐపీలతోపాటు కల్యాణంలో పాల్గొనే భక్తులు, అర్చకులు, డోనర్లు, మీడియా కోసం ప్రత్యేకమైన లాబీలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు కల్యాణతంతు స్పష్టంగా కనినిపించే విధంగా 8 ఎల్‌ఈడీ స్క్రీన్లను బిగించనున్నారు. స్వామివారి కల్యాణం చేయించుకునే భక్తులకు రూ. 3,000 టికెట్‌ ధరను నిర్ణయించారు. కల్యాణం అనంతరం దాతలకు శేష వస్త్రంగా ఒక ఉత్తరీయం, కనుము, అభిషేకం లడ్డూ, 2 వడలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. గతంలో స్వామివారి కల్యాణం ఉదయం కొండకింద పాత హైస్కూల్‌ మైదానంలో నిర్వహించేవారు. పునర్నిర్మాణం అనంతరం ప్రధానాలయంతోపాటు ఆలయ మాఢ వీధులు విశాలంగా ఉండడంతో ఈసారి బ్రహ్మోత్సవాలను కొండపైనే నిర్వహిస్తున్నారు.

కల్యాణోత్సవంలో పాల్గొననున్న ప్రముఖులు 

స్వయంభూ ప్రధానాలయంలో ఈ నెల 28న రాత్రి 8 జరిగే తిరు కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు పాల్గొననున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామకృష్ణరావు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అలోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

కొండపైకి 10 నిమిషాలకో బస్సు 

బ్రహ్మోత్సవాలకు బస్సు మార్గంలో వచ్చే భక్తులకు ఆటంకం కలుగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌తోపాటు నల్లగొండ, వివిధ ప్రాంతాల నుంచి నుంచి భక్తులు ఎక్కువగా వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌ నుంచి ప్రతి అరగంటకు గుట్టకు ఒక బస్సు ఉన్నది. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి కూడా బస్సులు నడుస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట బస్టాండ్‌ నుంచి కొండపైకి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే 4 బస్సులు కొండపైకి నడుస్తుండగా అదనంగా మరో 3 బస్సులను ఏర్పాటు చేయనున్నారు.

మొక్కు సేవలు రద్దు 

యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 21 నుంచి 3 వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామకృష్ణ తెలిపారు. స్వామివారి రాత్రి నివేదన అర్చన తదుపరి 8.15 నుంచి 9.00 గంటల వరకు బలిహరణ, ఆరగింపు రద్దు చేయనున్నారు. 21వ తేదీ నుంచి మార్చి 3 సాయంత్రం వరకు భక్తులతో నిర్వహించే అర్చనలు, బాలభోగాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 27 నుంచి మార్చి 1 వరకు అభిషేకం, అర్చనలు రద్దు చేయనున్నట్లు చెప్పారు.

విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం 

ఆలయ పునర్నిర్మాణంలో మరో అద్భుత కట్టడం విష్ణు పుష్కరిణి. కొండపైన క్యూ కాంప్లెక్స్‌ పక్కన రూ. 5.3 కోట్లతో దీనిని నిర్మించారు. పొడవు 19 మీటర్లు, వెడల్పు 21 మీటర్ల వెడల్పుతో మండపంతో నిర్మించిన పుష్కరిణిలో చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నారు. చక్రతీర్థం అనంతరం స్వామివారికి వినియోగించిన శుద్ధ జలాలను ప్రచారం రథంతో ఊరేగింపుగా వెళ్లి కొండకింద లక్ష్మీ పుష్కరిణిలో కలుపుతారు. అనంతరం లక్ష్మీ పుష్కరిణిలో భక్తులకు పుణ్యస్నానాలకు అనుమతినిస్తారు.

వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు 

ఆలయాన్ని విశాలంగా కృష్ణ శిలలతో మహాద్భుతంగా నిర్మించారు. ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా మాఢ వీధులను తీర్చిదిద్దారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరిగే బ్రహ్మోత్సవాలు కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆలయాన్ని వివిధ రకాల పూలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించనున్నారు. ఆలయ ప్రధాన రహదారుల్లో లైటింగ్‌తో కూడిన స్వాగత తోరణాలు బిగించనున్నారు. ఇందుకు కావాల్సిన టెండర్‌ ప్రక్రియను పూర్తి చేశారు.

వైటీడీఏ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు 

బ్రహ్మోత్సవాల సందర్భంగా వైటీడీఏ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం తూర్పు మాఢ వీధుల్లోని బ్రహ్మోత్సవ మండపం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నారు. 24 నుంచి 27 వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. దీంతో పాటు వీఐపీ వాహనాల పార్కింగ్‌ ప్రాంతంలో దేవస్థానం ఆధ్వర్యంలో 26 నుంచి ఉదయం, సాయంత్రం సాంస్కృతిక, ధార్మిక, సంగీత, సాహిత్య సభలు ఉంటాయని ఆలయ డీఈఓ భాస్కర్‌శర్మ వెల్లడించారు.

రూ.1.50 కోట్లు కేటాయింపు 

గతేడాది బ్రహ్మోత్సవాలకు రూ. 72 లక్షల ఖర్చు వచ్చింది. ఈ సారి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ. 1.50 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.50 లక్షలు ప్రధానాలయం, పురవీధులు, కొండకింద గల ప్రధాన రహదారి, పాత బస్టాండ్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో డెకరేషన్‌ లైటింగ్‌కు వినియోగించనున్నారు. మరో రూ. 20 లక్షలు పూలు కొనుగోలు చేయనున్నారు. మరో రూ. 80 లక్షలు బ్రహ్మోత్సవాల్లో వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు. ఈసారి చలువ పందిళ్లు, సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయనున్నారు.

మాఢవీధుల్లో అలంకార సేవలు 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా అలంకార సేవలు ఈ నెల 23న ఉదయం 9 గంటలకు మత్స్యాలంకారంతో ప్రారంభం కానున్నాయి. మార్చి 1న ఉదయం 9 గంటలకు మహావిష్ణువు అలంకారంపై గరుఢ వాహన సేవతో సేవలు ముగుస్తాయి. మొదటి ప్రాకార మండపంలో స్వామివారి సేవలను అలంకరించనున్నారు. సేవలను ఉత్తర రాజగోపురం గుండా మాఢవీధుల్లో ఊరేగిస్తారు. అక్కడి నుంచి తూర్పు రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన ఆస్థానం వద్ద భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అక్కడి నుంచి దక్షిణ భాగం మాఢ వీధుల గుండా పశ్చిమ రాజగోపురం, ఉత్తర గోపురం నుంచి సేవను లోపలికి ప్రవేశింపజేస్తారు.

madagoni surendar

Feb 15 2023, 12:46

*19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి*

19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి

Streetbuzz news : నల్గొండ జిల్లా :

ఈనెల 19వ తేదీన హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించబోయే హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి బైక్ ర్యాలీని పురస్కరించుకొని ఈరోజు రామగిరి రామాలయంలో వాల్ పోస్టల్ ఆవిష్కరించడం జరిగింది.

 హిందూ వాహిని ఉమ్మడి జిల్లా ప్రముఖ్ సంగపాక రాంబాబు గారు మాట్లాడుతూ ఈ ఆదివారం 19వ తేది సాయంత్రం 4.00 గంటలకు స్థానిక రామగిరి రామాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభం అయితుందని, ఈ ర్యాలీలో సంఘ వివిధ క్షేత్ర ప్రముఖులు పెద్దలు ,కార్యకర్తలు మరియు హిందూ బంధువులందరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ సోదరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెద్ద బోయిన రామకృష్ణ, ఉపాధ్యక్షుడు గండికోట రాజు, ఉపాధ్యక్షుడు తారల నరేష్, జిల్లా కమిటీ మెంబర్ దొండ నరేందర్, ఉపాధ్యక్షుడు పందిరి మాధు, గురు, సతీష్ ,హరి ,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 15 2023, 12:41

కల సాకారం.. కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ

కల సాకారం.. కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమిపూజ

Streetbuzz news :

అమరావతి: వైఎస్సార్‌ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌ భూమిపూజ చేశారు.

అనంతరం స్టీల్‌ప్లాంట్‌ నమూనాను సీఎం పరిశీలించారు. స్టీల్‌ ప్లాంట్‌ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు.

madagoni surendar

Feb 15 2023, 11:15

Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన పెనుముప్పు.

Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన పెనుముప్పు.

బీబీనగర్‌: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727) (Godavari Express)కు పెను ముప్పు తప్పింది..

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దీంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో కాజీపేట-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణహాని, గాయాలు కాలేదని.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఎస్‌-1, ఎస్‌-4, జీఎస్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ కోచ్‌లు పట్టాలు తప్పినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పట్టాలు తప్పిన బోగీలను వేరు చేశామని.. అదే రైలులో ప్రయాణికులను పంపిస్తున్నట్లు వెల్లడించింది.