అక్రమ అరెస్టులను ఖండించండి - సిఐటియు మండల కార్యదర్శి

            

అమ్ముల బాల్ నర్సయ్య సిఐటియు మండల కార్యదర్శి.                                      

Street Buzz news సిద్దిపేట జిల్లా:

(కొండపాక) :- అక్రమ అరెస్ట్ లను ఖండించాలంటూ సిఐటియు మండల కార్యధర్శి అమ్ముల బాల్ నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ  ఇండ్లు,ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకొని ఎక్కడికి అక్కడ ముందస్తు అరెస్టులు చేయడం హేయమైన చర్య అనిమండిపడ్డారు.రాష్ట్రంలో నిరసన తెలియజేసే హక్కు లేకుండా చూస్తున్నారని అన్నారు.ప్రభుత్వ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తుంటే రాత్రికి రాత్రి వచ్చి అత్యుత్సాహంతో అరెస్టు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. పోరాటాలను అణచివేయాలని చూడడము మంచిది కాదన్నారు. ఎంత ఆనచాలని చూస్తే అంత పోరాటాలు లేస్తాయని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులైన పేదలందరికీ తమ తమ గ్రామాలలో డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వాలని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని,స్థలముండిఇల్లునిర్మించుకుందామనుకునే అర్హులకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అన్నారు.

సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నియామాకాల్లో ప్రలోభాలకు లోను కావద్దు


- అభ్యర్థులకు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపిఎస్ హితవు

Street Buzz news కృష్ణా జిల్లా:

ప్రస్తుతం జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్స్ నియామకాల్లో ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకూడదనీ, నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి.జాషువా ఐపిఎస్ అధికారి తెలియచేసారు. ఏ విధమైన సిఫారసులు ఒత్తిడులూ, ఆర్ధికపరమైన అవనియామకకతవకలకు తావు లేకుండా నియామకం ఖచ్చితంగా జరుగుతుంది అని, అభ్యర్థులను ఎవరైనా రికమండేషన్లు, లంచం ద్వారా నియామకం ఇప్పిస్తామంటూ సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. రాతపరీక్షలకు సిలబస్ కు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలనీ, దేహదారుఢ్య పరీక్షలకు కూడా తగురీతిన ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు సంపొదించుకొని ఉద్యోగం సంపాదించుకోవాలనీ సూచించారు. ఏధమైనదళారీలు , ఇతర శక్తుల ప్రమేయం లేకుండా నియామకం జరిగుతుంది. కావున, ఎవరైనా అభ్యర్ధులను ప్రలోభాలకు గురి చేయుటకు ప్రయత్నించినచో సదరు విషయాన్ని పోలీసువారి దృష్టికి తక్షణమే తీసుకురావాలని సూచించారు.  ఇటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతూ, సదరు మోసగాళ్ళపై చట్టటరీత్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ నిధులు వెంటనే విడుధల చేయాలంటూ ఏఐటియూసి ధర్నా


- ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్

సిద్దిపేట కార్మిక శాఖ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా

Street Buzz news సిద్దిపేట జిల్లా:

(సిద్దిపేట):- భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ అనుబంధం భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బెక్కంటి సంపత్ ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట సహాయ కార్మిక శాఖ కార్యాలయం ముందు గంట పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణం, సహజ మరణం, మెటర్నిటి, మ్యారేజి బెనిపెట్లు, ఇతర పెండింగ్ క్లెయిమ్స్ 2018 నుండి 2023 జనవరి 31 వరకు పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల అడ్డాల వద్ద అన్ని వసతులతో షెడ్లు కట్టించాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు రూ.5వేల పించను ఇవ్వడంతో పాటు, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, రాష్ట్రంలో పెండింగులో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించి క్లెయిమ్స్ నిదులు విడుదల చేయాలని, చిన్న చిన్న పొరపాట్లు సరిచేసే అధికారం నోడల్ ఆఫీసర్ కు ఇవ్వాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 10 లక్షలు, సహజ మరణానికిరూ.5 లక్షలు, పెండ్లి కానుకకు రూ.1 లక్ష, మెటర్నిటీ రూ.50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. పిల్లల చదువులకు స్కాలర్ షీప్ లు అందించాలన్నారు. నిర్మాణ రంగంలో వాడే మెటీరియల్స్ ధరలను నియంత్రించాలని,కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులను సలహా బోర్డులో నియమించాలని, ఈ శ్రమ్ పోర్టల్లో కూడ భవన నిర్మాణ కార్మికులను నమోదు చేయించాలన్నారు. సకాలంలో రెన్యువల్ చేసుకోని వారికి ఆరు నెలల పాటు అనుమతించాలని,నూతనంగా బోర్డులో పేర్లు నమోదు చేసుకునే భవన నిర్మాణ కార్మికులకు రేషన్ కార్డులు జత చేయాలన్న నిబంధనను, కార్మికులు క్లెయిమ్స్ చేసుకున్న సందర్భంలో రేషన్ కార్డు నిబంధనను తొలగించాలన్నారు. జిల్లాలోని నోడల్ ఆఫీసర్, ఏ.ఎల్.ఓ ల పనివిధానం వల్ల కార్మికులు పూర్తిగా నష్టపోతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పరిష్కరించాలని

లేని పక్షంలో కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బెక్కంటి సంపత్, జిల్లా నాయకులు ఈరి భూమయ్య, గజ్జల సురేందర్, తిగుళ్ల కనకయ్య, ఒరుసు అనిల్, మోడీ చంద్రయ్య, లక్ష్మీ, అనంత, రాజయ్య, లింగం, రాములు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లో ప్రతి ముదిరాజ్ యువత ముందుకు రావాలి

మత్స్యకార్మికులకు అండగా నిలిచిన ప్రభుత్వం

Street Buzz news సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ నియోజకవర్గం) :- మంగోల్ గ్రామంలో ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి భాను కుమార్ ముదిరాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగోల్ గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన మత్స్య సహకార సంఘం సభ్యత్వానికి అందరు కలిసి వినియోగించుకోవాలని కోరారు.మత్స్యకారులకి ప్రభుత్వం అండగా నిలిచింది అన్నారు. గ్రామంలో ముదిరాజ్ కుటుంబమే అత్యధిక ఓట్లు ఉన్నవాళ్లు అని తెలిపారు. ప్రతి ముదిరాజ్ బిడ్డ గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. రాజకీయాల్లో ప్రతి ముదిరాజ్ యువత ముందుకి రావాలన్నారు.ఈ కార్యక్రమంలో మంగోల్ ముదిరాజ్ సంఘం పెద్దలు మరియు యువత పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా విస్మరించిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా విస్మరించిన ప్రభుత్వం - గిద్దె రాజేష్

Street Buzz news సూర్యాపేట జిల్లా:

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం 10000 వేల కోట్లతో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించాల్సిన ఆర్థిక మంత్రి హరీష్ రావు పైసా ఇవ్వకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరించారు వెంటనే ఆర్థిక మంత్రి బడ్జెట్ ను సవరించి 10000 కోట్లతో వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 2023-24 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం కృష్ణానగర్ గ్రామంలో సంఘం నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మంత్రి హరీష్ రావులు తెలంగాణ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న 30 లక్షల మంది వికలాంగుల సంక్షేమానికి 10000 కోట్లతో నిధులు కేటాయించాల్సిన ఉన్న పైసా కూడ ఇవ్వకుండా వికలాంగుల సమాజాన్ని విస్మరించారనీ వెంటనే ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి 10000 కోట్లతో వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలనీ     2,90,396 వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ప్రతిపాదించిందింన ప్రభుత్వం రెవెన్యూ వ్యయంలో 2016 RPD చట్టం ప్రకారం 5 శాతం నిధులు అంటే 10,584.25 కోట్లు వికలాంగుల సంక్షేమానికి కేటాయించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా వికలాంగుల సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో విస్మరించిందని రాష్ట్రంలో 44.12 లక్షల మందికి ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆసరా పింఛన్లకు 12,000 కోట్లు కేటాయించిందనీ ఆసరా పెన్షన్లు లబ్ధిదారుల సంఖ్య పెంచిన ప్రభుత్వం ఆ దిశగా బడ్జెట్లో నిధులను ఎందుకు ఇవ్వలేదని బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం నిధులు కేటాయించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వికలాంగుల సంక్షేమం కోసం మాత్రం పైసా కేటాయించలేదని రాష్ట్రంలో వికలాంగుల వివాహ ప్రోత్సాహకం స్వయం ఉపాధి రుణాలు పరికరాల కోసం ఎదురుచూస్తున్న వికలాంగుల సమాజానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదో మంత్రి హరీష్ రావు స్వష్టం చేయాలని రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న 30 లక్షల మంది వికలాంగుల సంక్షేమానికి దళిత బంధు తరహాలోని ప్రతి వికలాంగుడికి 15 లక్షల రూపాయలతో వికలాంగుల బందు పథకాన్ని ప్రవేశపెట్టాలని పోరాటాలు చేస్తున్న వికలాంగుల సమాజానికి మంత్రి ఏం సమాధానం చెప్తారో చెప్పాలనీ తను ప్రవేశపెట్టిన బడ్జెట్ సవరించి మంత్రి హరీష్ రావు పదివేల కోట్లతో వికలాంగుల బందు లాంటి పథకాలకు నిధులు కేటాయించాలని లేకుంటే మంత్రి హరీష్ రావు సొంత నియోజకవర్గమైన సిద్దిపేట గడ్డ నుంచే వికలాంగుల సమాజం సింహగర్జనకు సిద్ధమవుతుందని మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేగా మారాలని తాపత్రయపడుతున్నట్లు ప్రస్తుతం ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ చెప్తుందని అందుకే వికలాంగుల సంక్షేమ శాఖకు బడ్జెట్లో ఆయన నిధులు కేటాయించలేదన్నట్లు తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నేడు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ సిద్దిపేటలో ఆయన పతనానికి పునాదులు వేసినట్లు ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తగరం రాంబాబు స్వాతి మనస్వి తగరం గౌతమ్ ఊరుకొండ శరణ్య వాసంశెట్టి నవదీప్ మేడిపల్లి సరోజిని తదితరులు పాల్గొన్నారు.

వివాహిత అదృశ్యం - మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

Street Buzz newsనిర్మల్ జిల్లా: 

తానుర్ మండల కేంద్రానికి చెందిన వివాహిత పందిరివాడ్ పూజ ;( 26 ) అనే వివాహిత మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తానూర్ ఎస్ఐ.. బి.విక్రం తెలిపారు.ఎస్ఐ. తెలిపిన వివరాల ఈ విదంగా ఉన్నాయి. ఈ నెల 5 వ తేదిన ఇంట్లో నుంచి వెళ్లిన పందిరివాడ్ పూజ ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికిన లభ్యం కాకపోవడంతో భర్త రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భూపాలపల్లి గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం- కీర్తి రెడ్డి

Street Buzz news జయశంకర్ భూపాలపల్లి జిల్లా: 

(మొగుళ్ళపల్లి):- రాబోయే ఎన్నికల్లో భూపాలపల్లి గడ్డమీద కాషాయ జెండా ఎగరబోతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి చందుపట్ల కీర్తి - సత్యపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం భారతీయ జనతా పార్టీ మొగుళ్ళపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు చేవ్వ శేషగిరి యాదవ్ అధ్యక్షతన జరిగగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తి- సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో బిజెపి బూతు స్థాయిలోని కార్యకర్తలే పట్టుకొమ్మలని, ప్రతి కార్యకర్త సైనికుల వలె పనిచేసి భూపాలపల్లి లో బిజెపి జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ వైఫల్యాలను ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు కార్నర్ మీటింగ్ లో ప్రజా క్షేత్రంలో ఎండ గట్టెందుకు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ చేయాలని, అర్హులైనటువంటి నిరుపేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని, ఇంటికి ఒకరి కాకుండా అర్హులైన అందరికీ పెన్షన్ ఇవ్వాలని, పెంచిన కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని, దళితులకు ఇచ్చినటువంటి దళిత బందును రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చదువు రామచంద్రారెడ్డి, బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, పర్లపల్లి ఎంపీటీసీ దొంగల రాజయ్య, జిల్లా కార్యదర్శి అన్నం శ్రీనివాస్, దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు బండారి రవీందర్, జిల్లా నాయకులు పులి రత్నాకర్ రెడ్డి, మునిగంటి మల్లారెడ్డి, నాంపల్లి చంద్రమోహన్, తూముల సురేష్, వడిజ ధనేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శలు మోరే వేణుగోపాల్ రెడ్డి, బండారి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు పోతుగంటి సాయిలు, పెండ్లి మల్లారెడ్డి, బల్గూరి కిషన్ రావు, పిఎసిఎస్ డైరెక్టర్ తిరుపతిరావు, మండల కార్యదర్శి తేప్పరాజు కిసాన్మోర్చ మండల అధ్యక్షుడు అన్నం దేవేందర్ రెడ్డి,బీ జే వై ఎం మండలాధ్యక్షుడు బత్తిని శ్రీధర్ గౌడ్, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షుడు వంగ రవి, మండల నాయకులు వైనాల ప్రియాంక, శివకుమార్, మామునూరి నర్సయ్య, కక్కర్ల వీరన్న, పులి కోమల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, యారాసందీప్, మంద రమణారెడ్డి, ఎలిగేటి తిరుపతి, శ్రీ పెళ్లి రమేష్, బైరగోని మధుకర్, రవి, రేలా హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగాన్ని మరో మారు విస్మరించిన రాష్ష్ర బడ్జెజ్


- PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్

       

Street Buzz news తెలంగాణ రాష్ట్రం:

(సిద్దిపేట):- తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశం ముందు అపూర్వ ఆదర్శాన్ని నిలబెట్టిందని, సంక్షేమంలో స్వర్ణ యుగాన్ని సృష్టించిందని, అభివృద్ధిలో మానవ కోణం అద్దిందని గంభీర ఉపన్యాసాలు చేసిన సర్కారు చాలా ముఖ్యమైన, ప్రాధాన్యరంగమైన విద్యారంగాన్ని మాత్రం ప్రస్తుత బడ్జెట్లో ఆనవాయితీగా మరో మారు విస్మరించింది, నిరాశపరిచింది. ఈరోజు తెలంగాణ సర్కారు ₹2,90,396 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో విద్యారంగానికి అత్యల్పంగా నిరాశాజనకంగా కేవలం ₹19093 కోట్లు మాత్రమే కేటాయించింది. అనగా కేవలం 6.57% శాతం మాత్రమే కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించడం లేదని మరో మారు తేటతెల్లమైంది. ఇది అత్యంత శోచనీయం.విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్లో పాఠశాల విద్యారంగానికి ₹16092 కోట్లతో 5.54%, మరియు ఉన్నత విద్యకు ₹3001 కోట్ల రూపాయలతో ఒక శాతం కేటాయించి నిరుత్సాహపరిచిందని పి,డి,ఎస్,యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి. శ్రీకాంత్ మండిపడ్డారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది మంత్రి హరీష్ రావు పని తీరు


ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్*

Street Buzz news సిద్దిపేట జిల్లా: 

(సిద్దిపేట):- జిల్లా కేంద్రం లో గల ఏ ఐ పి ఎస్ యు విద్యార్థి సంఘం కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు కేవలం ఫోటోలకు ఫోజులిచ్చి ఫొటోస్ దిగగానే సరిపోదని, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురుకుంటున్నారో తెలుసుకోవాలని ఆయన అన్నారు. నిజంగా ప్రభుత్వా ఆసుపత్రిలో 66%మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా లేకపోతే మీరు అసెంబ్లీ లో చెప్పుకోవడానికి ఈ దొంగ మాటలు ఎందుకు చెప్తున్నారో ప్రజలకు తెలియ జేయాలనీ ఆయన అన్నారు. మీకు కనుక దమ్ముంటే నాతో ఒక్కసారి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రండి నేను అక్కడ జరుగుతున్న అన్యాయం ని చూపిస్తానని ఏ,ఐ,పి,ఎస్,యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరారు. మీకు పేద ప్రజల పై సవతి తల్లి ప్రేమ ఉందని రాష్ట్ర ప్రజలందరికి తెలుసు కానీ, సిద్దిపేట లో కూడ మీరు మెడికల్ మాఫియా కి సపోర్ట్ చేయడం చాలా సిగ్గు చేటని ఆయన అన్నారు. మీరు నిజంగా వైద్య శాఖ మంత్రి అయితే మీకు తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలపై ప్రేమ ఉంటే ఈ దొంగ రాజకీయాలు మాని మాతో ఒకసారి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మని కరకండిగా ఆయన మంత్రిని కడిగేశారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే చదువు రాని దద్దమ్మ లతో టెస్టులు చేయించి ఎవరిని ఆగం చేద్దామని మీ ప్రభుత్వం చూస్తుందని ఆయన అన్నారు. లంచాలు తీసుకొని సదువు సంధ్య లేని దద్దమ్మలకి అవుట్ సోర్సింగ్ జాబ్ లు ఇచ్చి పేద ప్రజలని ఇబ్బంది పెట్టె బదలు ఉద్యోగ నోటిఫికేషన్ లు జారీ చేయొచ్చు కదా హరీష్ రావ్ అని ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ మండిపడ్డారు. ఇప్పటికైనా లంచాలు తినడం మానేసి చిత్త శుద్ధితో మీ పని మీరు సక్రమంగా చేయాలనీ ఆయన అన్నారు. ఇప్పటికి లంచాలు మింగిన కాడికి చాలు మేము గనక ఒక్క ఆర్,టీ,ఐ వేసి సమాచారం లాగితే నువ్వు ఉండవని నీకు ఆ మంత్రి పదవి ఉండదని ఆయన అన్నాడు. నీ మంత్రి పదవి మేము పెట్టిన బిక్ష అని ఆయన అన్నాడు. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 2 గంటలపాటు పవర్ సప్లై ఉండదా డీజిల్ కు పైసల్ తక్కువ పడ్డాయా అని ఆయన గోంతేత్తి గర్జించారు. ఈ కార్యక్రమంలో ఏ,ఐ,పి, ఎస్,యు సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఒగ్గు రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి కుమార్, శివ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం

హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది*. 

Street Buzz news. హైదరాబాద్: - ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్‌ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్‌ మూసారంబాగ్‌కు చెందిన జాహెద్‌ అలియాస్‌ అబ్దుల్‌. హుమాయున్‌నగర్‌ వాసి మాజ్‌హసన్‌ ఫరూఖ్‌, సైదాబాద్‌ అక్బర్‌బాగ్‌కు చెందిన సమీయుద్దీన్‌పై కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని రద్దీప్రాంతాల్లో పేలుళ్లకు, ఉగ్రదాడులకు జాహెద్‌ బృందం కుట్ర పన్నుతోందనే సమాచారంతో ఈ ముగ్గురినీ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గతేడాది అక్టోబరులోనే రిమాండ్‌ చేయటం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌ నుంచి హవాలా రూపంలో నిధులతోపాటుమందుగుండు సామగ్రి సమకూరిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు తీవ్రత దృష్ట్యా ఎన్‌ఐఏ తాజాగా రంగంలోకి దిగింది.ఉగ్రకుట్రలకు సంబంధించి జాహెద్‌పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. 2005లోనే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసులో జైలుకెళ్లాడు. 2004లో రైట్‌వింగ్‌ కార్యకర్తల హత్యకు కుట్రతోపాటు 2012లో జైలు సిబ్బందిపై దాడి ఘటనల్లోనూ అతడిపై కేసులున్నాయి. 2005 నుంచి 2017 వరకు జైల్లోనే ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసును న్యాయస్థానం కొట్టేయడంతో 2017 ఆగస్టు 10న విడుదలయ్యాడు. విడుదలయ్యాక కూడా జాహెద్‌ ఉగ్ర ప్రణాళిక రచనల్లో మునిగితేలినట్లు ఇటీవలే హైదరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.