విద్య హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
Street Buzz news సిద్దిపేట జిల్లా:
(సిద్దిపేట):- కార్పొరేట్ విద్యా సంస్థలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 25% ఉచితంగా సీట్లు కేటాయించాలి విద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజీవ్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగాన్నినిరుపేద విద్యార్థులకు విద్యనందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తే విధంగా వ్యవహరిస్తున్నాయని అభివృద్ధి అంటే భవనాలు కాదని విద్య వైద్యం అందినప్పుడే దాన్ని అభివృద్ధి అంటారని విద్య వైద్యానికి గాలికి వదిలేసి ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో నిరుద్యోగులను చేస్తుందని ప్రభుత్వం విద్యా వ్యవస్థను కార్పొరేట్ వ్యవస్థలకు దారదత్తం చేసి ప్రభుత్వ విద్య వ్యవస్థకు నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇది పేస్టు పేజీ ఉచిత విద్య అనే మాటలు చెప్పి విద్య వ్యవస్థను విద్యాసంస్థలకు నిర్లక్ష్య ధోరణిగా ప్రభుత్వం చూస్తుందని ఇప్పటికైనా పేదవారికి కనీస విద్యా వైద్యం అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. విద్యా వ్యవస్థను పరిరక్షించడానికి ఎస్ఎఫ్ఐ ముందుండి పోరాటం చేసి విద్యా వ్యవస్థను కాపాడడాని ముందుంటుదన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
Feb 06 2023, 12:38