TeluguCentralnews

Oct 12 2021, 14:43

బొగ్గు కొరతపై నేడు ప్రధాని సమీక్ష..!

దిల్లీ: దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ సంక్షోభం తలెత్తబోతోందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.

 దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వల పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయం నేడు సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విద్యుత్‌, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా బొగ్గు నిల్వలపై కీలక భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో నిన్న సమావేశమైన అమిత్ షా.. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు, విద్యుత్‌ సరఫరా, డిమాండ్‌ వంటి అంశాలపై చర్చించారు.

దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయంటూ దేశ రాజధాని దిల్లీ సహా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం విద్యుత్ సంక్షోభం ఏర్పడబోదని, విద్యుత్ ఉత్పత్తికి సరిపడా వనరులు ఉన్నాయని చెబుతూ వస్తోంది. ఇదిలా ఉండగా.. బొగ్గు నిల్వలు నాలుగు రోజులకు కూడా సరిపోయేలా లేని విద్యుత్కేంద్రాల సంఖ్య 70కి పెరగడం మరింత కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తోంది. 

TeluguCentralnews

Oct 10 2021, 19:20

nలఖింపుర్‌ ఖేరి ఘటనపై.. రాష్ట్రపతిని కలిసేందుకు కాంగ్రెస్‌ సిద్ధం!

అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌కు లేఖ దిల్లీ: లఖింపుర్‌ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వివరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌ తాజాగా లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఏకే ఆంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, గులాం నబీ ఆజాద్‌, అధీర్‌ రంజన్‌ ఛౌదురి రాష్ట్రపతిని కలువనున్నారు. ‘లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కారణమంటూ రైతులు, ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఆశిష్‌ మిశ్రతోపాటు ఆయన అనుచరులు స్వయంగా వాహనం నడుపుకుంటూ తమపైకి దూసుకొచ్చినట్లు రైతులు చెబుతున్నారు.  అయినప్పటికీ నిందితులతోపాటు కేంద్ర మంత్రిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని రాష్ట్రపతి భవన్‌కు రాసిన లేఖలో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఈ నేపథ్యంలో లఖింపుర్‌ హింసకు సంబంధించిన వాస్తవాలతో కూడిన పూర్తి సమాచారాన్ని రాష్ట్రపతి ముందుంచేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ను కోరింది. ఇక ఈ కేసులో భాగంగా కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రను సుదీర్ఘంగా విచారించిన యూపీ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. తాజాగా ఆయనను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది..

Oct 10 2021, 19:18

nMAA Elections: రామ, రావణ యుద్ధంలా ఉంది:

మోహన్‌బాబు   ‘మా’ ఎన్నికలపై సీనియర్‌ నటుడు కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ఈసారి రామ రావణ యుద్ధంలా ఉన్నాయని సీనియర్‌ నటుడు మోహన్‌బాబు వ్యాఖ్యానించారు. మా అధ్యక్ష బరిలో పోటీ చేస్తున్న తన తనయుడు మంచు విష్ణు విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఉదయం నుంచి ఆయన పోలింగ్‌ కేంద్రం వద్దే ఉండి.. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రంలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్‌ మధ్య తలెత్తిన పలు వివాదాలను ఆయన సద్దుమణిగేలా చేశారు. విష్ణుకి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ని ఆలింగనం చేసుకుని.. ఎన్నికల వరకే ఈ వివాదాలని.. ‘మా’ అంతా ఒక్కటేనని చాటిచెప్పారు. అనంతరం ఎన్నికలపై స్పందించిన ఆయన..  ‘‘ఈ గొడవలన్నీ ఎందుకు జరుగుతున్నాయో నాకర్థం కావటం లేదు. ఫలితం ఏం వస్తుందో చూద్దాం! గెలుస్తామన్న నమ్మకం ఉంది. సినిమా తీసినప్పుడు ‘ఈ సినిమా హిట్‌ అవుతుంది’ అని ఏవిధంగా ఆశిస్తామో ఇది కూడా అంతే. ప్రజలు, సాయిబాబా ఆశీస్సులతో విష్ణు గెలుస్తాడు. ‘మా’ సభ్యులే నా బలం. ఇప్పుడున్న గొడవలు చూస్తుంటే రామ-రావణ యుద్ధంలా ఉంది. ఇదంతా అవసరమా? అనిపిస్తోంది’’ అని వివరించారు.

Oct 08 2021, 20:16

nహత్యకేసులో డేరాబాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు న్యూఢిల్లీ: రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌సింగ్‌ (డేరా బాబా)ను హరియానా సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. గతంలో ఆయన ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్‌ 2002, జులై 10న హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో సీబీఐ ప్రత్యే కోర్టు డేరా బాబాతోపాటు మరో నలుగురిని దోషులుగా తేల్చింది. అక్టోబర్ 12న దోషులందరికీ శిక్షలు ఖరారు చేయనుంది. కాగా, డేరాబాబా ఇప్పటికే ఆశ్రమంలోని ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.

TeluguCentralnews

Oct 08 2021, 15:25

శ్రీనగర్‌లో దారణం 

 ఉగ్రవాదులు ఒక స్కూలులో చొరబడి ప్రిన్సిపాల్ మరియు ఒక అధ్యాపకుడిని కాల్చి చంపారు 

ఉగ్రవాదులు కాలేజీలోకి ప్రవేశించి స్టాఫ్ మీటింగ్‌లో ఉన్న ప్రిన్సిపాల్‌ను , అధ్యాపకులను చేరుకుని , లైన్‌లో నుంచో బెట్టి అందులో ముస్లింలు ఎవరో identity card ద్వారా తెలుసుకుని వారిని వేరుచేసి ముస్లిమేతరులైన ప్రిన్సిపాల్ ( సిక్కు మహిళ) ను & హిందూ అధ్యాపకుడిని కాల్చి చంపారు 

  ఈ విషయాన్ని ఏ రాజకీయ పార్టీ నాయకుడూ, పార్టీలు ఖండించవు 

లఖిమ్ పూర్‌లో జరిగిన హత్యలకు ఎగేసుకుంటూ పోయిన వెధవలకు కాశ్మీర్ మాత్రం కనపడదు 

TeluguCentralnews

Oct 08 2021, 11:08

కొవిషీల్డ్‌ తీసుకుంటే క్వారంటైన్‌ నుంచి మినహాయింపు

భారతీయులకు ఊరటనిచ్చిన బ్రిటన్‌

దిల్లీ: కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు వేసుకొని తమ దేశానికి వచ్చే భారతీయులకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపునిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్‌ గురువారం వెల్లడించారు. కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ తమ దేశానికి వచ్చే భారతీయులు 10రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ బ్రిటన్‌ ఇటీవల నిబంధన జారీ చేసింది. దీంతో భారత్‌ కూడా ఇక్కడికొచ్చే బ్రిటన్‌ పౌరులకూ క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. దీంతో ఆ దేశం దిగొచ్చింది. 

TeluguCentralnews

Oct 08 2021, 11:07

మధ్యప్రదేశ్‌లో మూడు పత్రికలపై సీబీఐ కేసులు

సర్క్యులేషన్‌ ఎక్కువగా చూపుతూ ప్రభుత్వం నుంచి ప్రకటనలు

భోపాల్‌: ప్రభుత్వం నుంచి రూ.లక్షల విలువైన ప్రకటనలను పొందేందుకు మధ్యప్రదేశ్‌లో వాస్తవ సర్క్యులేషన్‌ను పెంచి చూపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడు పత్రికలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ సంస్థల ప్రచురణదారులు/యజమానులపై నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం వంటి అభియోగాల కింద కేసు పెట్టింది. హిమాంశు కౌశల్‌ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యను చేపట్టినట్లు సీబీఐ తెలిపింది. సర్క్యులేషన్‌కు సంబంధించి చార్టర్డ్‌ అకౌంటెంట్ల ఇచ్చిన నివేదికలను ఫోర్జరీ చేసి చూపడం ద్వారా గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆడ్వర్టైజింగ్‌ అండ్‌ విజువల్‌ పబ్లిసిటీ’ (డీఏవీపీ) నుంచి లక్షల విలువైన ప్రకటనలను ఈ పత్రికలు పొందాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు 

TeluguCentralnews

Oct 08 2021, 11:06

India Corona: 2.4 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

నాలుగున్నర లక్షలకు చేరిన మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతుండటం ఊరటనిస్తోంది. దాంతో కొవిడ్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య 205 రోజుల కనిష్ఠానికి చేరింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.

తాజాగా 13,85,706 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 21,257 మందికి పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి. 271 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరగా.. 4,50,127 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో 2,40,221 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.71 శాతానికి తగ్గింది. రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది. నిన్న 24,963 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.32 కోట్ల(97.96 శాతం) మార్కును దాటాయి. ఇక నిన్న 50.17 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దాంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 93 కోట్లకు చేరింది.