అష్టకష్టాలను తొలిగించే దైవం హనుమంతుడు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గురుస్వామి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
అష్టకష్టాలను తొలిగించే దైవం హనుమంతుడు!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
గురుస్వామి బీఆర్ఎస్ రాష్ట్ర
తేది: 21-05-2025 బుధవారం
చిన్నకోడూర్ న్యూస్
ఆంజనేయస్వామిని హిందూ ధర్మంలో రక్షకుడు, విజయ ప్రదాత, అడ్డంకులను తొలగించే దేవుడిగా భావిస్తారు అని గురుస్వామి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
హనుమాన్ దీక్ష పురస్కరించుకుని మంగళవారం రాత్రి హనుమాన్ మలాధారణ స్వాములు చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఆంజనేయస్వామి శోభయాత్ర తీసిన సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతు హనుమంతుడు ఆయన విధేయత, శౌర్యం, బలానికి ప్రతీకగా నిలుస్తారు అని.
ఆంజనేయుడు తన భక్తులను మరియు శ్రీరాముని రక్షించేందుకు ప్రయత్నించాడు అని ఆయన భక్తులకు అపాయాలు రాకుండా రక్షిస్తాడు అని అన్నారు.
ఆంజనేయుడు తనని నమ్మిన వారికీ సమస్త విజయాలను ప్రసాదిస్తాడని ప్రజలు నమ్ముతారు.
ఆంజనేయుడు ప్రతి అడ్డంకిని తొలగించి, భక్తులకు సంతోషం, ప్రశాంతతను ప్రసాదిస్తాడు.
ఆంజనేయుడిని ఆరాధించేవారు, ఆయన యొక్క విధేయత, శౌర్యం, బలం, మరియు రక్షణ కోసం ఆయనను కొలుస్తారు అని అన్నారు.
హనుమాన్ శోభయాత్ర ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాముని ఉమేష్ చంద్ర, మాజీ ఎంపిటిసి పానుగంటి శారద రమేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెరుకు పెద్దలు, హనుమాన్ స్వాములు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, దయ్యాల పవన్, రాగిరి సాయి కుమార్, జంగిటి సాయి కిరణ్, మిట్టపల్లి సాయి తేజ, రాగిరి శివ, కోరమేన ప్రసాద్, జంగిటి రాజు, చెరుకు హరీష్, పిల్లి విజయ్, ఎయ్య రమేష్, ఇట్టమేన రవికుమార్, పిల్లి కుమార్, రజినీకాంత్, దయ్యాల నాగరాజు, వినయ్ గౌడ్, కొరిమి అరుణ్ కుమార్, రవితేజ, గొట్టిపర్తి శ్రీనివాస్, ఇట్టమేన గోపి, విష్ణు, పెదివిరి రాకేష్ రెడ్డి, గుండు అభినవ్, పూసల అవినాష్, పెసరి కౌశిక్ తదితరులు ఉన్నారు.
Jun 03 2025, 17:42