/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా Raghu ram reddy
వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా

తెలంగాణలో రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే నేటి (నవంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించనున్నారు. ఈనెల 6 నుంచి 8 వరకు మాడ్రోజుల పాటు ఇంటి నెంబర్ల ప్రక్రియ పూర్తి కావటంతో నేటి నుంచి వివరాల సేకరణ మెుదలుపెట్టనున్నారు. అయితే ఉద్యోగం, ఉపాధి, వృత్తి కోసం సొంతూళ్లను వదిలి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు తమ వివరాలు నమోదు చేసుకోవటం కోసం సొంతూళ్లకు వెళ్లాల్సిన అసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఎక్కడి వారు అక్కడే వివరాలు చెబితే సరిపోతుందని అంటున్నారు.

తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న సర్వే ప్రారంభం కాగా.. ఈనెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి 8 వరకు ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు చేసి స్టిక్కరింగ్ వేశారు. తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అందుకు అనుగుణంగా 87,092 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించి వారికి సర్వే బాధ్యతలు అప్పగించారు.

ఒక్కో ఎన్యూమరేటర్ 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించడంతో వీటి నంబర్ల నమోదు పూర్తి చేశారు. గ్రామాల్లో స్టిక్కరింగ్ పూర్తి కాగా.. పట్టణాలు, నగరాల్లో అక్కడక్కడా కొన్ని ఇండ్లు మిగిలాయి. వాటి వివరాల నమోదు నేటితో పూర్తి చేయనున్నారు. ఇక స్టిక్కరింగ్ అయిపోవటంతో నేటి రెండోదశ సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. అయితే వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి చాలా మంది దూరప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో ఉంటున్నారు. ఆధార్‌ కార్డులో అడ్రస్ ఉన్న చోటికి, సొంతింటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

దీంతో చాలా మంది సొంతూళ్లకు పయనమయ్యారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఒక కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే ఎన్యుమరేటర్ల వద్ద తమ వివరాలను నమోదు చేయించుకునే అవకాశమిచ్చింది. స్వగ్రామం, సొంతిటికి వెళ్లాల్సిన పని లేదని చెప్పారు. ఉన్నచోట వివరాలు చెబితే సరిపోతుందని వెల్లడించారు.

కుటుంబ సభ్యుల ఆధార్, మెుబైల్ నంబర్లు, ప్రశ్నపత్రంలో అడిగిన వివరాలన్నీ తెలపాలన్నారు. ఆధార్, రేషన్‌కార్డు, ధరణి పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకం వంటివి అందుబాటులో ఉంచుకుంటే ఈజీగా ఉంటుందని చెబుతున్నారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు త్వరగా సమాచారం ఇవ్వవచ్చునని అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్లు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ తెలంగాణలోనూ అడుగు పెడుతోంది. హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్లను నిర్మించనుంది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాలు ముంబై, కోల్‌కతా, గుర్గావ్‌, పుణెల్లో ట్రంప్‌ టవర్స్‌ నిర్మించిన ఆ సంస్థ.. తాజాగా మరో ఆరు టవర్లను నిర్మించాలని నిర్ణయించింది.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు చెందిన నిర్మాణ సంస్థ తెలంగాణలోనూ అడుగు పెడుతోంది. హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్లను నిర్మించనుంది. భారత్‌లో ఇప్పటికే నాలుగు నగరాలు ముంబై, కోల్‌కతా, గుర్గావ్‌, పుణెల్లో ట్రంప్‌ టవర్స్‌ నిర్మించిన ఆ సంస్థ.. తాజాగా మరో ఆరు టవర్లను నిర్మించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌తోపాటు నోయిడా, బెంగళూరుతోపాటు పుణెలో మరో టవర్‌ను నిర్మించనుంది. దీంతో భారత్‌లో ట్రంప్‌ టవర్ల సంఖ్య 10కి చేరనుంది. తద్వారా అమెరికా బయట అత్యధికంగా ట్రంప్‌ టవర్లు భారత్‌లోనే ఏర్పాటు కానున్నాయి. కాగా, హైదరాబాద్‌లో స్థానిక మంజీరా గ్రూప్‌తో కలిసి జంట టవర్లు నిర్మించే యోచనలో ట్రంప్‌ నిర్మాణ సంస్థ ఉంది.

ఇందుకోసం 2022లోనే మాదాపూర్‌లోని ఖానామెట్‌లో 2.92 ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏ వేలంలో కొనుగోలు చేసింది. 27 అంతస్తుల్లో నాలుగు బెడ్‌రూంలు, ఐదు బెడ్‌రూంల అపార్టుమెంట్లతో నిర్మించనున్నారు. నాలుగు బెడ్‌రూంల అపార్టుమెంట్ల విస్తీర్ణం 4వేల నుంచి 5వేల చదరపు అడుగులు, ఐదు బెడ్‌రూంల అపార్టుమెంట్ల విస్తీర్ణం 6వేల చదరపు అడుగులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

చదరపు అడుగుకు రూ.13 వేలుగా ధరను నిర్ణయించాలని అప్పట్లో భావించారు. నాటి లెక్క ప్రకారమే నాలుగు బెడ్‌రూంల అపార్టుమెంట్‌ ధర రూ.5.5 కోట్లు కానుంది. ఇక ఇతర నగరాల్లో ట్రిబెకా డెవలపర్స్‌తో కలిసి నిర్మించే టవర్లలో అపార్టుమెంట్లే కాకుండా.. ఆఫీసులు, విల్లాలు, గోల్ఫ్‌ కోర్స్‌లు ఉండనున్నాయి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా

జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బాధ్యతలు స్వీకరించడానికి ముందే తనకు ఎంతో ఇష్టమైన ఒక అలవాటును ఆయన వదులుకోవాల్సి వచ్చింది. ప్రతి రోజూ ఉదయం ఎంతో ఇష్టంగా కొన్ని కిలోమీటర్ల మేర మార్నింగ్ వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు. తనను ఎవరూ గుర్తుపట్టరనే నమ్మకంతో ఢిల్లీలోని లోధి గార్డెన్ ప్రాంతం, తన ఇంటి చుట్టుపక్కల ఒంటరిగా వాకింగ్ చేస్తుండేవారు.

అయితే గత నెలలో సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. భద్రతా సిబ్బందితో మార్నింగ్ వాక్‌కు వెళ్లాలని భద్రతా అధికారులు ఆయనకు సూచన చేశారు. అయితే చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడే జస్టిస్ సంజీవ్ ఖన్నా మార్నింగ్ వాక్‌కు వెంట సెక్యూరిటీని తీసుకెళ్లడం ఇష్టంలేదని తిరస్కరించారు. ఆ అలవాటునే పూర్తిగా మానేయాలని ఆయన నిర్ణయించుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

కాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీలోని బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌ నుంచి లా డిగ్రీ పొందారు. ఢిల్లీలో పెరిగిన ఆయనకు నగరంలోని ప్రతి మూల గురించి బాగా అవగాహన ఉంది. ఆయన ఇప్పటికీ తన స్కూలు, కాలేజీ, క్యాంపస్ లా సెంటర్ స్నేహితులతో టచ్‌లో ఉన్నారని, వారి ఇళ్లకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారని సంజీవ్ ఖన్నా సన్నిహితులు తెలిపారు.

జస్టిస్ ఖన్నా పెద్దగా మారలేదని ఆయన స్నేహితులు చెబుతున్నారు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి ఇప్పటికీ సాదాసీదాగా, ప్రశాంతంగా ఉంటారని అంటున్నారు.

కెమెరాలకు, ప్రచారానికి దూరంగా ఉంటారని ఒక స్నేహితుడు చెప్పారు. కాగా భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 6 నెలలు కొనసాగుతారు. మే 13, 2025న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

రిటైర్ కానున్న సీజేఐ డీవై చంద్రచూడ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం రిటైర్ కానున్నారు. రిటైర్మెంట్ అనంతరం సుప్రీంకోర్టు సీజేఐ, న్యాయమూర్తులు.. కోర్టుల్లో ప్రాక్టీస్ చేయవచ్చా?

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం అంటే నవంబర్ 10వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టునున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును కేంద్రానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇప్పటికే ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు కేంద్రం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సోమవారం అంటే నవంబర్ 11వ తేదీన సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయమూర్తులు సైతం రిటైర్ అవుతుంటారు. అనంతరం వారు దేశంలోని వివిధ కోర్టుల్లో న్యాయవాదులుగా ప్రాక్లీస్ చేయవచ్చా? అనే సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులే కాదు ఇతర న్యాయమూర్తులు సైతం.. న్యాయాన్ని రక్షించడంతోపాటు భారత రాజ్యాంగాన్ని పరిరక్షిచడంలో వీరంతా కీలకంగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో వారి పదవి కాలం ముగిసిన అనంతరం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(7) ప్రకారం.. సీజేఐలు, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏ భారతీయ కోర్టులో న్యాయవాద వృత్తిని నిర్వహించకూడదని నిషేధం విధించింది.

న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతోపాటు సమగ్రతపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొంచిందే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్. అలాంటి దేశంలో న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభంగా పరిగణింపబడుతుంది. ఆ వ్యవస్థ యొక్క విశ్వసనీయత.. వాస్తవ నిష్పాక్షికతపై ఆధారపడి ఉంటుంది. దీంతో న్యాయమూర్తి విధులు నిర్వహించిన అనంతరం న్యాయవాదిగా చేయడానికి అనుమతించినట్లు అయితే వారి పదవీ కాలంలో ఇచ్చిన తీర్పులపై పలు సందేహాలు రేకెత్తినట్లు అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. వైరుధ్యాలను నివారించడం, న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కొనసాగించడం, అనవసరమైన ప్రభావాన్ని నిరోధించడం కోసం.. కోర్టుల్లో వీరి ప్రాక్టీస్‌పై భారత రాజ్యాంగం నిషేధం విధించింది.

ది ఆర్బిట్రేషన్ అండ్ కొన్సలైషన్ యాక్ట్ -1996 ప్రకారం.. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు మధ్యవర్తులుగా అంటే ఆర్బిట్రేటర్స్ లేదా మీడియేటర్స్‌ (arbitrators or mediators)గా వ్యవహరించవచ్చు. ఎందుకంటే చట్టపరమైన పలు అంశాలు క్లిష్టంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను పరిష్కరించడం కోసం వీరిని ఆర్బిట్రేటర్స్‌గా నియమించే అవకాశం ఉంది. .

అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన వారిని వివిధ కమిషన్లకు చైర్మన్లుగా ప్రభుత్వం నియమిస్తుంది. అంటే జాతీయ మనవ హక్కుల కమిషన్, లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చైర్మన్‌గా నియమించ వచ్చు.

ఇక చాలా మంది పదవి విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తులు.. న్యాయ కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంటారు. అలాగే న్యాయ శాస్త్రంలో తమకున్న జ్ఞానాన్నివిద్యార్ధులకు తమ ప్రసంగాల పాఠాల ద్వారా అందిస్తారు. ఇంకొంత మంది అయితే.. న్యాయ శాస్త్రాలకు చెందిన పుస్తకాలను రాస్తుంటారు. అదే విధంగా రాజ్యాంగ బద్ద సంస్థలకు అధిపతులుగా లేకుంటే రాష్ట్రాలకు గవర్నరులు, ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీల్లో సభ్యులుగా సైతం నియమించే అవకాశముంది.

అయితే గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గోగోయి విధులు నిర్వహించారు. ఆయన పదవి విరమణ చేశారు. ఆ కొద్ది కాలానికే ఆయన రాజ్యసభ సభ్యుడుగా పెద్దల సభలో అడుగు పెట్టారు. ఈ వ్యవహారంపై ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. అలాగే సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో ఇటీవల వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దీనిపై కూడా పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బీజేపీ అగ్రనాయకత్వం స్పందించిందిన విషయం విధితమే.

370 అధికరణపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధులేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శుక్రవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ఎజెండాను, కశ్మీర్‌లో వేర్పాటువాద భాషను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు.

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో కేంద్రం రద్దు చేసిన 370వ అధికరణ (Article 370)ను దేశంలోని ఏ శక్తి పునరుద్ధరించ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెగేసి చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతంలో (జమ్మూకశ్మీర్) కాంగ్రెస్ పార్టీ కుట్రలను మహారాష్ట్ర ఓటర్లు గుర్తించాలని హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధులేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శుక్రవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ఎజెండాను, కశ్మీర్‌లో వేర్పాటువాద భాషను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను తిరిగి పునరుద్ధరించాలంటూ రెండ్రోజుల క్రితం అక్కడి అధికార 'ఇండియా' కూటమి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ కుట్రలను మహారాష్ట్ర ప్రజలు అవగాహన చేసుకోవాలని, 370వ అధికరణపై అక్కడి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని దేశం అంగీకరించిందని అన్నారు. ఏ శక్తి కూడా ఆ అధికరణను వెనక్కి తేలేదని స్పష్టం చేశారు. 370వ అధికరణకు మద్దతుగా అసెంబ్లీ వెలుపల బ్యానర్లు పెట్టారు. ఆ అధికరణను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ కూటమి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.. దీనిని దేశ ప్రజలు ఆమోదిస్తారా? ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు శక్తవంచన లేకుండా నిరసన తెలిపినప్పటికీ వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించేశారు. కాంగ్రెస్ కూటమి నిజస్వరూపం ఏమిటో యావద్దేశం అవగాహన చేసుకోవాలి'' అని మోదీ అన్నారు.

370వ అధికరణను పునరుద్ధరించేందుకు దేశ ప్రజలు అంగీకరించరని, కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆటలు మోదీ ఉన్నంత వరకూ సాగవని ప్రధాని అన్నారు. బీమ్‌రావ్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే అక్కడ నడుస్తుందని, ఏ శక్తీ 370వ అధికరణను వెనక్కి తేలేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. విపక్ష సభ్యలు తీవ్ర ప్రతిఘటన, నిరసనల మధ్య జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 370వ అధికరణను పునరుద్ధరించే తీర్మానాన్ని గత శుక్రవారంనాడు మూజువాణి ఓటుతో ఆమోదించారు.

తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్ వచ్చింది.

తిరుమల లడ్డు వ్యవహారంపై త్వరలో విచారణ జరగనుంది. సీబీఐ నియమించిన బృందానికి సహాయపడేందుకు అదనంగా సిబ్బంది కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సీబీఐ అనుమతి తీసుకుని మరి కొంతమంది పోలీస్ అధికారులను, సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణ కోసం సీబీఐ డైరెక్టర్ 5 గురు అధికారులను నియమించారు.

సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ ఏస్ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ IG సర్వశ్రేష్ఠ త్రిపాటి, విశాఖ రేంజ్ DIG జెట్టి గోపీనాథ్, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీ రంభ, FSSAI సలహాదారుడు డాక్టర్ సత్య కుమార్ పండా లను సీబీఐ నియమించింది. ఈ బృందం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పని చేస్తుందని సీబీఐ పేర్కొంది. అయితే, సీబీఐ నియమించిన బృందానికి మరి కొంతమంది అధికారులు, ఇతర స్టాఫ్ కావాలని అధికారులు కోరారు.

తిరుమల లడ్డూ అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో రకాల ప్రసాదాలున్నప్పటికి భక్తులకు తిరుమల లడ్డూ అంటే ఎంతో ప్రత్యేకం. అయితే, ఈ లడ్డూ న్యాణతపై గత కొంతకాలంగా విమర్శలు వస్తునే ఉన్నాయి. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతోపాటు అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ఓ లాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. దీనిని నిర్థారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం గుజరాత్ లోని ల్యాబ్‌కు పంపారు. ఆ రిపోర్టులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు తేలడంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. అయితే, ఈ సంఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.

తిరుమల కల్తీ నెయ్యి వివాదం పరిశీలనకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ రంగంలోకి దిగింది. తిరుపతిలో సిట్ కోసం ప్రత్యేక కార్యలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్‌ని సీబీఐ అధికారులు పరిశీలించారు. త్వరలోనే క్షేత్ర స్థాయిలోకుడా సిట్ బృందం పరిశీలన చేయనుంది. ఇప్పటికే సిట్ అధికారులు పరిశీలించిన దర్యాప్తు నివేదికని సీబీఐ బృందం పరిశీలించే అవకాశం ఉంది. త్వరలోనే తిరుమలలోని ల్యాబ్, లడ్డు తయారీ పోటుని దర్యాప్తు బృందం పరిశీలించనుంది. టీటీడీకి నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీని కూడా సీబీఐ బృందం పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. విచారణను స్వయంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించనున్నారు..

గ్రామ గ్రామాన బీజేపీ జండా ఎగరాలి

రాబోయే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలవాలి.

గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగిన మాట వాస్తవం. సమన్వయ లోపాలు ఓటమికి దారితిస్తాయి.

పెద్ద చిన్న అందరు కలిసికట్టుగా నిలబడి విజయం సాధించాలి అని ఆకాంక్షిస్తున్నాను. మోడీజీ పరిపాలననే బ్రమాస్త్రంగా ప్రజలకు వివరించాలి.

 మంగినపల్లి వెంకట చేతన్

 బీజేపీ రాష్ట్ర నాయకులు

తోపులాటలో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తోపులాటలో చిక్కుకుపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ మంత్రి తోపులాటలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది.

మంత్రి కొండా సురేఖ (Minister Konda surekha) తోపులాటలో ఇరుక్కుపోయారు. అవును.. మీరు విన్నది కరెక్టే. స్వయంగా రాష్ట్రానికి మంత్రి అయిన కొండాసురేఖ తోపులాటలో ఇరుక్కుపోయి ఇబ్బందులకు గురయ్యారు. చుట్టూ పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ తోపులాట నుంచి మంత్రిని బయటకు తీయలేని పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ యాదాద్రిలో ఏం జరిగింది.. మంత్రి కొండా సురేఖ తోపులాటలో ఎలా ఇరుక్కుపోయారో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు (శుక్రవారం) యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటన సందర్భంగా పెద్దఎత్తు ఆయన అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. సీఎంను చూసేందుకు ఎగబడ్డారు.

వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో తూర్పు గోపురం వద్ద పోలీసులు - కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ కూడా తూర్పుగోపురం వద్దకు వచ్చారు. అంతలోనే తోపులాట చోటు చేసుకోవడంతో మంత్రి కూడా అందులో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి వెళ్లలేక తోపులోటలో కాసేపు మంత్రి విలవిలలాడి పోయారు. చివరకు ఎలాగోలా పోలీసులు.. మంత్రి కొండా సురేఖను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాటతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తానికి కార్యకర్తలను అదుపు చేయడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు.

మైనారిటీ హోదాపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ విద్యాసంస్థా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్ట్ కీలకమైన తీర్పు ఇచ్చింది.

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (AMU) మైనారిటీ విద్యాసంస్థా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్ట్ ఇవాళ (శుక్రవారం) కీలకమైన తీర్పు వెలువరించింది. ఏఎంయూకు మైనారిటీ హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. ఏఎంయూకి మైనారిటీ హోదాను తొలగిస్తూ 1967లో ఇచ్చిన తీర్పును న్యాయస్థానం రద్దు చేసింది. ఈ మేరకు రాజ్యాంగ ధర్మాసనం 4:3 అనుకూల తీర్పు ఇచ్చింది. అయితే మైనారిటీ హోదా కల్పించే అంశంపై తుది నిర్ణయాన్ని మరో బెంచ్‌కు అప్పగిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ అంశంపై విచారణకు మరో బెంచ్ ఏర్పాటు కానుంది.

చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీర్పును చదివారు. ధర్మాసనంలో నాలుగు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని వెల్లడించారు. మెజారిటీ తీర్పును తానే స్వయంగా రాశానన్నారు. జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్ మిశ్రా, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్ దత్తా, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ వేర్వేరుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

కాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని 1920లో స్థాపించారు. భారత రాజ్యాంగం ప్రకారం మైనారిటీ సంస్థగా గుర్తించవచ్చా లేదా అనే అంశం దీర్ఘకాలంగా వివాదాస్పద చర్చ నడుస్తోంది.

తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సుప్రీంకోర్టులో కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను నేడు విచారించనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిని(Tirumala) కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ అంశంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేయనుంది. తిరుమల దేవాలయాల నిర్వహణ పాలకమండలి చేతిలో కాకుండా పూజారుల చేతుల్లో ఉంచాలని కేఏ పాల్ పిటిషన్‌లో కోరారు.

దీంతోపాటు దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని పాల్ అన్నారు. తిరుమల దేవాలయానికి వచ్చే వేల కోట్ల ఆదాయం దుర్వినియోగం అవుతుందని కేఏ పాల్ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, సీబీఐ, డీజీపీలను ప్రతివాదులుగా చేరుస్తూ కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు.

కేవలం 744 మంది కేథలిక్కులున్న వాటికన్ సిటీని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారని ఈ సందర్భంగా కేఏ పాల్ ప్రస్తావించారు. ఇదే సమయంలో లక్షలాది మంది భక్తులకు ప్రాధాన్యత ఉన్న తిరుపతిని కూడా ఆ విధంగా చేయాలని పాల్ కోరారు. 100 రోజుల సంకీర్ణ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చారని విమర్శించారు. జులైలో లభించే లడ్డూల నాణ్యతపై ల్యాబ్ రిపోర్టును సెప్టెంబర్‌లోనే ఎందుకు తెప్పించారని, సమస్య ఏ సమయానికి వచ్చిందని ప్రశ్నించారు.

లడ్డూ వివాదానికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కేఏ పాల్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. లడ్డూలలో ఎలాంటి కల్తీ లేదని, భక్తుల్లో అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని, లడ్డూల గురించి తదుపరి చర్చలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని పాల్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. అంతేకాదు తిరుమల లడ్డూల నాణ్యతపై తలెత్తిన వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణ అవసరమని కేఏ పాల్ గతంలో అన్నారు.

కేఏ పాల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో లడ్డూ వివాదం, తిరుపతికి కేంద్ర పాలిత హోదా కల్పించే రెండింటిపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు. మరి కేఏ పాల్ పిటిషన్ విషయంలో ధర్మాసనం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.