టీడీపీలో తీవ్ర విషాదం మాజీ మంత్రి కన్నుమూత
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో కన్నుమూశారు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. రెడ్డి సత్యనారాయణ మరణంపై సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. రెడ్డి సత్యనారాయణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో రెడ్డి సత్యనారాయణ ఒకరు.
గతంలో మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగు దేశం పార్టీ తరఫున వరుసగా 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు.. పశుసంవర్ధక శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు ఆయన టీటీడీ పాలకమండలి సభ్యుడిగా కూడా పనిచేశారు. 2004 ఎన్నికల్లో రెడ్డి సత్యనారాయణ టీడీపీ నుంచి మరోసారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు.
సత్యనారాయణ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి అనుభవించినప్పటికి చాలా నిరాడంబరంగా ఉండేవారు. సీనియర్ నేత అయినా సరే.. నిత్యం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. రెడ్డి సత్యనారాయణ 2023 అక్టోబర్‌లో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.. ఆ తర్వాత కోలుకున్నారు. దాదాపు ఏడాది తర్వాత ప్రాణాలు కోల్పోయారు
Nov 05 2024, 11:26