నిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స
చిన్నతనం నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న యువకుడికి నిమ్స్ వైద్యులు(Nims doctors) అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మహబూబాబాద్(Mahbubabad) జిల్లా కుర్వి మండలం నారాయణపురం తండాకు చెందిన బానోత్ అశోక్ (20) చిన్నతనం నుంచే ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో అతని తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా హృద్రోగ సమస్య ఉందని గుర్తించారు.
చిన్నతనం నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న యువకుడికి నిమ్స్ వైద్యులు(Nims doctors) అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మహబూబాబాద్(Mahbubabad) జిల్లా కుర్వి మండలం నారాయణపురం తండాకు చెందిన బానోత్ అశోక్ (20) చిన్నతనం నుంచే ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో అతని తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా హృద్రోగ సమస్య ఉందని గుర్తించారు. ఐదేళ్ల వయసులో ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయగా కోలుకున్న అతను నాలుగేళ్లుగా ఆయాసం, గుండెదడతో బాధపడుతున్నాడు.
పరీక్షించిన వైద్యులు అతడి పల్మనరీ వాల్ లీక్ అవుతుందని గ్రహించారు. వెంటనే శస్త్ర చికిత్స చేయించాలని, అందుకు రూ. 25లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. దాంతో అతడిని నిమ్స్‌కు తరలించగా కార్డియాలజీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సతీష్(Senior Professor Dr. Sai Satish) ఆధ్వర్యంలో ఆధునిక పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు పరిశీలించి రక్తనాళాల ద్వారా కృత్రిమ పల్మనరీ వాల్వ్‌ను అమర్చేందుకు నిర్ణయించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ సహకారంతో డాక్టర్ సాయి సతీష్ నేతృత్వంలో వైద్యులు హేమంత్, శైలేష్ భాటియా, రాజశేఖర్, అమర్నాథ్, త్యాగి, అనస్తీషియా వైద్యులు డాక్టర్ అద్నాన్, తదతరులతో కూడిన వైద్యబృందం అక్టోబరు 25న శస్త్ర చికిత్సను నిర్వహించింది. రోగికి 35 మిల్లీమీటర్ల సైజు మై వాల్ కృత్రిమ పల్మనరీ కవాటాన్ని అమర్చారు. ఈ రకం పల్మనరీ కృత్రిమ కవాటం అమర్చడం భారతదేశంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్దదని నిమ్స్ కార్డియాలజీ వైద్యులు సతీష్ తెలిపారు.
Nov 04 2024, 11:12