తెలంగాణలో ఒంటిపూట బడులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుల గణన అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ప్రక్రియ కోసం టీచర్ల సేవలను వినియోగించుకోనుంది. దీంతో, రాష్ట్రంలోని బడులను ఒంటి పూట నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు జరగనున్నాయి. బడులు నిర్వహించే సమయాలను అధికారులు ఖరారు చేసారు.
తెలంగాణలో పేరెంట్స్ కు బిగ్ అలర్ట్. వేసవి కాలం రాకముందే ఒంటి పూట బడులు అమలు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన మొదలు కానుంది. సమగ్ర కులగణన కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లను ప్రభుత్వం నియమించింది. అలాగే మరో 8 వేల మంది ఇతర సిబ్బందిని కూడా ఈ ప్రక్రియలో భాగం చేసింది. దీంతో సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు ఒక్కపూటే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీంతో, ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు టీచర్లు స్కూళ్లలో పనిచేయాలి. అనంతరం కులగణన కోసం ఇంటింటికీ వెళ్లాలి. ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను సర్కారు నియమించింది. 50 ప్రశ్నల ద్వారా డేటాను అధికారులు సేకరించనున్నారు. దీని కోసం వారికి ప్రత్యేకంగా కిట్లను కూడా అందజేశారు. ఈ నెల 13వ తేదీ వరకు కులగణన మీద ప్రజాసేకరణ ఉంటుందని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ వెల్లడించారు. దీంతో, అప్పటి వరకు పాఠశాలలు ఒంటి పూటే నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ సర్వే పూర్తయ్యే వరకు అని తాజా సర్క్యులర్ లో స్పష్టం చేసారు. సర్వే మరింత సమయం తీసుకుంటే పొడిగించే అవకాశం ఉంది.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కుల గణన కోసం ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను నియమించింది. 50 ప్రశ్నల ద్వారా అధికారులు, సిబ్బంది డేటా సేకరించనున్నారు. ఇందు కోసం సర్వే కిట్లను అందజేశారు. కులగణనపై ఈనెల 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఈ కులగణన సకలజనుల సర్వేలాగా ఉండదని... సర్వే రిపోర్ట్‌ను దాచిపెట్టుకోకుండా ప్రజల ముందు పెడతామని వెల్లడించారు. ఈనెల 30లోగా సర్వే పూర్తిచేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈ సర్వేకు అనుగుణంగా పాఠశాలల నిర్వహణ పైన నిర్ణయం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Nov 02 2024, 12:26