మాజీసీఎంకు షాకిచ్చిన హైకోర్టు.
మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam)పై నమోదైన అక్రమాస్తుల కేసు మళ్లీ విచారించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 2001 నుంచి 2006 వవరకు అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన పన్నీర్‌సెల్వం, ఆదాయానికి మించి రూ.1.77 కోట్ల ఆస్తులు కూడబెట్టారంటూ డీఎంకే ప్రభుత్వంలో కేసు నమోదైంది.
మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam)పై నమోదైన అక్రమాస్తుల కేసు మళ్లీ విచారించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 2001 నుంచి 2006 వవరకు అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన పన్నీర్‌సెల్వం, ఆదాయానికి మించి రూ.1.77 కోట్ల ఆస్తులు కూడబెట్టారంటూ డీఎంకే ప్రభుత్వంలో కేసు నమోదైంది. హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో ఈ కేసు విచారణ మదురై జిల్లా కోర్టు నుంచి శివగంగ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు.
అనంతరం అధికారం బదిలీ జరిగి అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో, పన్నీర్‌సెల్వం, ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు నుంచి విడుదల చేస్తూ 2012లో శివగంగ జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసును మళ్లీ విచారించేలా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశన్ సుమోటాగా స్వీకరించి విచారించారు. ఈ కేసు విచారణకు స్టే విధించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తోసివేతకు గురైంది. ఈ నేపథ్యంలో, ఒ.పన్నీర్‌సెల్వంపై ఉన్న కేసును మళ్లీ విచారించాలంటూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ఉత్తర్వుల్లో... కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తే జామీనును మదురై ప్రత్యేక కోర్టు రద్దు చేయవచ్చని, కేసుకు సంబంధించిన దస్తావేజులు మదురై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు నవంబరు 27వ తేదిలోపు బదిలీ చేయాలని, రోజు వారీ విచారణ చేపట్టి 2025 జూలై నెలలోపు మదురై ప్రత్యేక కోర్టు ముగించాలని పేర్కొన్నారు. ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న పన్నీర్‌సెల్వం సతీమణి సహా ఇద్దరు మృతిచెందడంతో వారిపై ఉన్న కేసులు ఉపసంహరించుకున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Oct 30 2024, 18:21