హాస్పిటల్స్ లో క్లినికల్, నాన్ క్లినికల్ స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలి: ఆరోగ్యశాఖ మంత్రి
HYD: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) హాస్పిటళ్ల పనితీరు, టీవీవీపీ ని సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ గా బలోపేతం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) రూపొందించిన ప్రతిపాదనలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, అధికారులు శ్రీనివాస్, పద్మజ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి) కన్సల్టంట్స్ సుబోధ్, వీరభద్రయ్య, శ్రీదేవి, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
వీవీపీని సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా మార్చడం కోసం రూపొందించిన ప్రతిపాదనలపై ఆస్కి కన్సల్టంట్స్ మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీవీవీపీ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా హాస్పిటళ్లలోనే ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయా హాస్పిటళ్లలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రస్తుత అవసరాలకు మాత్రమే కాకుండా, భవిష్యత్ అవసరాలు, ఓపీ, ఐపీ, బెడ్ స్ట్రెంత్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని సూచించారు.
ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్‌ఎస్) ప్రకారం హాస్పిటల్స్‌లో క్లినికల్, నాన్ క్లినికల్ స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలన్నారు. ఈ మేరకు అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్లు, ఇతర ఉద్యోగుల ప్రమోషన్లు, ఇతర సర్వీసు మ్యాటర్స్‌లో ఇబ్బందులు, లీగల్ చిక్కులు తలెత్తకుండా ప్రతిపాదనలు ఉండాలన్నారు.
Oct 22 2024, 22:10