నాంపల్లి: సన్నరకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ కు తెచ్చేటప్పుడు తేమ శాతం 17% ఉండేటట్టు చూసుకోవాలని,తాలు లేకుండా కల్లాల వద్దనే వరి ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని రైతులను కోరారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఉంటుందని తెలిపారు. రైతులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.అదేవిధంగా దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్, అగ్రికల్చర్ ఏఓ, మానేటింగ్ ఆఫీసర్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డీ, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి, పానగంటి వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజాచారి, పూల గిరి, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు శేఖరు, నరసింహ, కిషన్, రాములు, శ్రీను, యాదమ్మ, రాజు, శివ, తదితరులు పాల్గొన్నారు.
Oct 15 2024, 20:23