Breaking : బాంబు పేల్చిన బండి సంజయ్ ‼️
- ప్రజలారా తుట్ పాలిష్ పట్టిన కేసిఆర్ భారీ స్కెచ్
- అతిత్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం
తెలంగాణలో ‘విలీనం’ పై గట్టిగానే రాజకీయాలు నడుస్తున్నాయ్..! అదిగో ఫలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటే.. అబ్బే మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ అంటోంది..!
ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ అన్నింటిలోనూ కామన్‌గా బీఆర్ఎస్ పార్టీ ఉంది..! బీజేపీతో బీఆర్ఎస్‌కు (BJP, BRS) సన్నిహిత సంబంధాలున్నాయన్నది కొన్నేళ్లుగా నడుస్తున్నదే..!
అయితే ఈ మధ్య బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ఓ రేంజిలో బంతాట ఆడుకుంటోంది. రుణమాఫీ చెప్పిన టైమ్ కంటే చేసేయడం.. రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ముహూర్తం ఎప్పుడు అంటూ మాట్లాడటం ఇలా రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఈ క్రమంలోనే త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ రాగా.. తాజాగా బీజేపీ నుంచి కౌంటర్ వచ్చేసింది.
బీజేపీలో బీఆర్ఎస్ కాదు.. కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ (Congress, BRS) విలీనం కాబోతోందని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి. బండి రిలీజ్ చేసిన ఈ ప్రకటనపై ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది.
Sep 10 2024, 09:59