/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz Breaking : బాంబు పేల్చిన బండి సంజయ్ ‼️ TeluguCentralnews
Breaking : బాంబు పేల్చిన బండి సంజయ్ ‼️

- ప్రజలారా తుట్ పాలిష్ పట్టిన కేసిఆర్ భారీ స్కెచ్

- అతిత్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం

తెలంగాణలో ‘విలీనం’ పై గట్టిగానే రాజకీయాలు నడుస్తున్నాయ్..! అదిగో ఫలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటే.. అబ్బే మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ అంటోంది..!

ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ అన్నింటిలోనూ కామన్‌గా బీఆర్ఎస్ పార్టీ ఉంది..! బీజేపీతో బీఆర్ఎస్‌కు (BJP, BRS) సన్నిహిత సంబంధాలున్నాయన్నది కొన్నేళ్లుగా నడుస్తున్నదే..!

అయితే ఈ మధ్య బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ఓ రేంజిలో బంతాట ఆడుకుంటోంది. రుణమాఫీ చెప్పిన టైమ్‌ కంటే చేసేయడం.. రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ముహూర్తం ఎప్పుడు అంటూ మాట్లాడటం ఇలా రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఈ క్రమంలోనే త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ రాగా.. తాజాగా బీజేపీ నుంచి కౌంటర్ వచ్చేసింది.

బీజేపీలో బీఆర్ఎస్ కాదు.. కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్‌ (Congress, BRS) విలీనం కాబోతోందని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి. బండి రిలీజ్ చేసిన ఈ ప్రకటనపై ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది.

రేపు తెలంగాణకు కేంద్ర బృందం ‼️

- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

- కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి

- కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ వెల్లడి

తెలంగాణలో ఈ నెల 11న కేంద్ర బృందం పర్యటించనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ కల్నల్‌ కీర్తి ప్రతాప్‌ సింగ్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం బుధవారం ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు.

ఈ బృందంలో ఆర్థిక , వ్యవసాయం, రోడ్లు, రహదారులు, గ్రామీణాభివృద్థి, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఉంటారని వివరించారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతా ల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుందని కిషన్‌ రెడ్డి తెలిపారు.

చర్లపల్లి స్టేషన్‌కు రోడ్లు వేయాలంటూ రేవంత్‌కు లేఖ

సికింద్రాబాద్‌, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రహదారుల విస్తరణకు సహకరించాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని పేర్కొంటూ, ప్రయాణికుల రాకపోకలకు కనీసం వంద అడుగుల రోడ్డు అవసరమని వివరించారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌, క్వాడ్రప్లింగ్‌తో పాటుగా లైన్ల విద్యుదీకరణ, 40కి పైగా ేస్టషన్ల అభివృద్థి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్‌ నిర్మాణం వేగవంతంగా పూర్తవుతోందని, ప్రయాణికుల రాకపోకల కోసం 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరముందని లేఖలో వివరించారు.

సికింద్రాబాద్‌ రైల్వేేస్టషన్‌ను రూ.715 కోట్లతో వచ్చే ఏడాది చివరి నాటికల్లా అత్యాధునిక వసతులతో ప్రజలకు అంకితం చేయడానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. రైల్వేేస్టషన్‌కు ప్రయాణికులు వచ్చి, పోయే మార్గాలు చాలా ఇరుకుగా ఉండటంతో, పీక్‌ అవర్స్‌లో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయని, సమస్య పరిష్కారానికి సీఎం చొరవతీసుకోవాలని కిషన్‌రెడ్డి లేఖలో కోరారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ కేశినేని శివ నాథ్

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయ వివరాలను అడిగి తెలుసుకున్న ఎం.పి.కేశినేని శివ నాథ్

వరద ముంపు కి గురైన ప్రతి ఇంటికి, ప్రతి షాప్ కి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నష్టపరిహారం అందిస్తారని బాధితులకు తెలిపిన ఎంపీ కేశినేని శివ నాథ్

వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో రేపు సాయంత్రానికి కల్లా రోడ్లు, ఇళ్లు ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామన్న ఎంపీ కేశినేని శివ నాథ్

ఇంట్లో పాడైన ఎలక్ట్రిక్ వస్తువులు రిపేరు చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుంది

వరద లో మునిగిన ఆటోలు ద్విచక్ర వాహనాలు,కార్లు ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు ..

వరద నష్టం అంచనా వేయటానికి ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వస్తారని అందరికీ న్యాయం జరుగుతుందన్న ఎం.పి కేశినేని శివ నాథ్

ఊర్మిళా నగర్ రెడ్డి కాలనీ ఏకలవ్య నగర్ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి వరద బాధితులతో మాట్లాడిన ఎం.పి.కేశినేని శివ నాథ్

ఎసిఏ అధ్య‌క్షుడిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎన్నిక

లెమన్ ట్రీ హోటల్ లో ది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పెషల్ జనరల్ మీటింగ్

ఏసిఎ జనరల్ మీటింగ్ లో ఎసిఏ అధ్య‌క్షుడిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎన్నికైనట్లు ప్రకటన

ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిచిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్యానెల్

ఏక‌గ్రీవంగా జ‌రిగిన ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు

ఎన్నిక‌ల్లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్యానెల్ కి పోటీగా నామినేష‌న్స్ దాఖ‌లు చేయ‌ని మ‌రో ప్యానెల్

ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గా గౌరు విష్ణుతేజ్ ఎన్నిక‌

ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ.

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యటిస్తున్న కిషన్ రెడ్డి.

వరదలకు తాము సర్వం కోల్పోయినా కేంద్రం నుంచి తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని కిషన్ రెడ్డని నిలదీసిన వరద బాధితులు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొంగులేటి వెంటే ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించిన మంత్రి పొంగులేటి.

వరదల్లో ఇళ్ళు కోల్పోయిన వారికీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఇళ్ళు కట్టిస్తామని హామీనిచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ.
TeluguCentralnews

మధురా నగర్ రైల్వే ట్రాక్ పై చంద్ర బాబు అదే సమయంలో ట్రాక్ పైన రన్నింగ్ ట్రైన్. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. చంద్రబాబుకు మూడు అడుగుల దూరంలోనే పాస్ అయిన ట్రైన్..

చంద్రబాబు కు తృటిలో తప్పిన ప్రమాదం
మధురా నగర్ రైల్వే ట్రాక్ పై చంద్ర బాబు అదే సమయంలో ట్రాక్ పైన రన్నింగ్ ట్రైన్. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. చంద్రబాబుకు మూడు అడుగుల దూరంలోనే పాస్ అయిన ట్రైన్..
నలుగురిని కాపాడి.. వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన వ్యక్తి

విజయవాడకు చెందిన చంద్రశేఖర్(32) సింగ్ నగర్‌లో డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది.

చంద్రశేఖర్ తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు.

తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయడు. చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భవతిగా ఉంది.

TTD: శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక ఈ కేంద్రాల్లోనూ లభ్యం..!!

Srivari Laddu Prasadam: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక ఎంపిక చేసిన కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.

తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇక నుంచి దర్శనం టికెట్‌ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, భక్తుల నుంచి వస్తున్న వినతులతో లడ్డూ పలు కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది.

తగ్గిన రద్దీ

తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. తిరుమలలో శ్రీవారి ప్రసాదం లడ్డూ పంపిణీలో తాజాగా టీటీడీ మార్పులు చేసింది. ఇక నుంచి దర్శనం టికెట్‌ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా అందించాలని.. అదీ కూడా ఆధార్​కార్డు చూపించి మాత్రమే రెండు లడ్డూలు కొనుగేలా చేసేలా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేసారు.

ఇదే సమయంలో లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని ఈవో శ్యామలా రావు తెలిపారు.

లడ్డూ ప్రసాదం

గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబరెటరీ లేదని, ప్రయివేటు ల్యాబరెటరీ సౌకర్యం ఉన్న పరిశీలించలేదన్నారు.

టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబరెటరీ ఏర్పాటు చేస్తునట్లు ఈవో వెల్లడించారు. ఇదే సమయంలో మరో నిర్ణయం తీసుకున్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు.

వర్షాలతో మరో 16 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 594 రైళ్లు రద్దు.

పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో 15 రైళ్ల దారి మళ్లింపు.

పలు ప్రాంతాల్లో ట్రాక్‌లు సిద్ధం కావడంతో 8 రైళ్లు పునఃప్రారంభం.

యథావిథిగా మరో 4 రైళ్ల రాకపోకలు.