Flash ; నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం !
- హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు ఎమ్మెల్యేలు
విజన్ 2047 రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం దేవాదాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సీఎం చర్చించనున్నారు. ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో ప్రణాళిక శాఖ సమావేశం నిర్వహించింది.
ప్రధానితో వికసిత్ ఏపీ విజన్ - 2047 డాక్యుమెంట్ విడుదల చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అనంతరం దేవదాయ శాఖపై చంద్రబాబు సమీక్షించనున్నారు. సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
పేదరిక నిర్మూలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘విజన్ డాక్యుమెంట్ 2047’ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలు, మండలాలకు సంబంధించిన 2047 విజన్ డాక్యుమెంట్లను కూడా తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ ప్రజల జీవితాల్లో మార్పు కోసం తాజాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
పేదరికం లేని సమాజం, జనాభా సమతుల్యతపై కసరత్తు చేసి ప్రణాళికలు రూపొందిస్తామని ఇప్పటికే చంద్రబాబు తెలిపారు. అన్ని రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనుసంథానం చేస్తామని గతంలో వెల్లడించారు. ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే యోచన చేస్తున్నట్టు కూడా చంద్రబాబు తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్‌లో రాష్ట్రస్థాయి నుంచి కుటుంబస్థాయి వరకు ప్రణాళికలు రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకువచ్చేందుకు సైతం కృషి చేస్తున్నారు.
Aug 28 2024, 08:45