తమ సమస్యలు పరిష్కరించాలని ఇంద్ర పార్క్ కు వందలాదిగా తరలి వెళ్లిన AITUC కార్మికులు
తమ సమస్యలు పరిష్కరించాలని ఇంద్రపార్క్ కు వందలాదిగా తరలి వెళ్లిన ఏఐటీయూసీ కార్మికులు.. హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను అరెస్టు చేయడమేనా మార్పు అంటే..! గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణం.. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ. ఇమ్రాన్.. అరెస్ట్ అయిన నాయకులను పరామర్శించిన ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరుగుతున్న ధర్నాకు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఆటో, హమాలీ, మధ్యాహ్న భోజన కార్మికులు వందలాదిగా తరలి వెళ్లడం జరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. బుధవారం రోజున ఇంద్రపార్క్ వద్ద ధర్నాకు వెళ్తున్న కార్మికుల వాహనాలను ఇమ్రాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆటో దేవులకు సంక్షేమండు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు ఇస్తామని హామీ నిలబెట్టుకోవాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులకు నెలకు 10,000 ఇస్తా ఆమెని వెంటనే అమలు చేయాలని, సివిల్ సప్లై హమాలీ కార్మికులకు కూలి రేట్ల పెంచి నూతన కూలి రేట్ల ఒప్పందాన్ని వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ అడుగు జడల్లో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని, మార్పుకు నాంది ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు? ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావడం నేరమా. అధికారం లేనప్పుడు అరెస్టులపై నిర్బంధాలపై గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ అధికారం రాగానే ఏడు నెలల్లోనే అక్రమ అరెస్టులకు నిర్బంధాలకు నిర్వచనం గా మారడం కాంగ్రెస్ అంటేనే నైజాం అని, నిరూపించుకోవడం నిజమైందన్నారు అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఉద్యమకారులకు కొత్త కాదని. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ అయిన వారిలో మధ్యాహ్నం భోజనం వంట కార్మికుల జిల్లా అధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శి బాగుల వసంత ముంతాజ్ బేగం, జిన్న రాజమ్మ మరియు ఆలేరులో సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, కనకయ్య, రాజు తదితరులు. హైదరాబాదు వేరిన వారిలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గబోయిన వెంకటేష్, సామల భాస్కర్, నాయకులు తారాల ఉపేందర్, ఏడ్ల నరేష్, గోర్లు లక్ష్మణ్, ఎండీ షరీఫ్, జిన్నా నర్సింహా, కొత్త కృష్ణ, ముదిగొండ బస్వయ్య, మామిండ్ల సత్యనారాయణ, దంతూరి జ్ఞానేశ్వర్ మర్రిపల్లి సాయి కిరణ్,
Aug 03 2024, 16:44