దళితులు సేద్యం చేసుకుంటున్నా ప్రభుత్వ భూమికి పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలి: కొండమడుగు నరసింహ డిమాండ్
గత 60, 65 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నా హన్మాపురం గ్రామ దళితులందరికీ వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలోని దళితులు సాగు చేసుకుంటున్న సర్వే నెంబరు 87 లోని 15 ఎకరాల 12 గుంటల భూమిని సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహ్మ, రైతులతో కలిసి పరిశీలన చేసినా అనంతరం నిర్వహించిన సదస్సులో నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ హన్మాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 87 లోని 15 ఎకరాల 12 గంటల భూమిని 14 ఎస్సీ కుటుంబాలకు చెందిన 29 మంది సేద్యం చేసుకుంటున్నారని వారందరికీ ప్రభుత్వము వెంటనే నూతన పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేసినారు. ఆనాడు ఎన్నో కష్టనష్టాలకు ఓడ్చి పైసా పైసా కూడా పెట్టి భావి తొవ్వి , కరెంటు సాంక్షన్ ను తెచ్చుకొని మోటార్ తో నీటిని తోడి ఆ నీళ్లతో వ్యవసాయ పంటను పండించి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. కానీ ఆ భూములకు పట్టాదారు పాసుబుక్కులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది పొందలేదని, బ్యాంకుల నుండి కూడా ఎలాంటి సహాయము తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. సేద్యం చేసుకుంటున్నా భూమికి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని పలుమార్లు జిల్లా కలెక్టర్, ఆర్డిఓకు, స్థానిక తహసిల్దారుకు, ప్రజా ప్రతినిధులకు మెమోరండం ఇచ్చి మొరపెట్టుకున్నా ఇప్పటివరకు నూతన పాస్ బుక్స్ లు ఇవ్వలేదని అన్నారు. ఈ మధ్యకాలంలో ఆ భూమిని భూమి కాజేయడానికి, ఆక్రమించడానికి పక్కనున్న కొంతమంది భూసాములు ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణం స్పందించి భూమిని సర్వే చేసి హద్దురాళ్ళు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహ మాట్లాడుతు రెక్కాడితే గాని డొక్కానిండని దళితులు భూమిని సాగు చేసుకుని బతుకుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగుదారులైన దళితులందరికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని లేనిచో పోరాటాన్ని కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం నూతన పాసుబుక్కుల సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బిచ్చాల మహేందర్, ప్రధాన కార్యదర్శిగా మూడుగుల రాజు, గౌరవ అధ్యక్షులుగా మూడుగుల అంజయ్య, ఉపాధ్యక్షులుగా బండారి రామచందర్, సహాయ కార్యదర్శిగా చందుపట్ల మల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా బిచ్చాల మైసయ్య, మూడ్గుల వెంకటయ్య, మూడ్గుల బాల్ నరసింహ, బండారి జీవన్ రావ్, బిచ్చాల పరుశరాములు, పొట్ట జగన్ ఎన్నుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముడుగుల బాలరాజు, బాల్ నరసింహ, మైసయ్య, కొండలు ప్రభాకర్, ఉప్పలయ్య, మహేష్, వెంకన్న, బిక్షపతి, రమేష్, నరసయ్య, మైసయ్య, కొండలు, రాజు, ఉప్పలయ్య, సుధాకర్, నరసింహ, పెంటయ్య, బిక్షపతి, లక్ష్మి, పరమేష్, కొండల్ ,సీతారాములు, మైసయ్య, జయమ్మ, లింగయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Jul 26 2024, 18:34