తెరుచుకోనున్న జగన్నాథుడి రత్నభాండాగారం!
ఒడిశాలోని పూరీ క్షేత్ర రత్న భాండాగారం అద్భుతమైన ఖజానా. జగన్నాథుడి వెలకట్టలేని ఆభరణాలను ఐదు చెక్క పెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు.
గతంలో దానిని అప్పుడప్పుడు తెరిచి సంపద లెక్కించేవారు. 1978 నుంచి దాన్ని తెరవడం ఆపేశారు. దాంతో వివాదాలెన్నో తెరపైకి వచ్చాయి. ఇటీవలే ప్రభుత్వం మారడంతో దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఈనెల 14న దానిని తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.



భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో పైకప్పు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు.
దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె నేడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తును CBI చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటుంది. నీట్ పరీక్షలో అవకతవకల నిగ్గు తేల్చేందుకు CBI గురువారం గుజరాత్ కు చేరుకుందని ఆ వర్గాలు తెలిపాయి. పంచమల్ ప్రాంతంలోని రెండు పాఠశాలల్లో నీట్ పరీక్షకు కేంద్రం ఉంది. పేపర్ లీకేజీకి సంబంధించి పరీక్ష రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది వాంగ్మూలాలు అధికారులు నమోదు చేయనున్నారు.
Jul 11 2024, 11:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.8k