హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా స్టార్ క్రీడాకారుని సానియా మీర్జా?
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోలిటికల్ ఎంట్రీ ఇవ్వను న్నారనే ఓ చర్చజరుగు తుంది అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగనున్నారనే ప్రచారం సర్కిల్‌లో సాగుతోంది.
హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఎంఐఎం పార్టీకి కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీకి ప్రత్యర్థిగా సాని యాను బరిలో దింపాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకోవైపు లోక్‌సభ ఎన్నిక లకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస పార్టీ ఎంపిక చేసి ప్రకటించింది. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ క్రమంలో అభ్య ర్థుల ఎంపిక కోసం.. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బుధవారం సమావేశమైంది.
ఈ సమావేశంలో హైదరా బాద్ లోక్‌సభ అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక తన రాజకీయ రంగ ప్రవే శంపై సానియా మిర్జా కానీ ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జా కానీ ఎటువంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు చేయలేదు.
దీంతో హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. మరోవైపు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా మాధవీ లత పేరును ఆ పార్టీ అగ్రనా యకత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఈ సారి ఎలాగైనా హైదరా బాద్ లోక్‌సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకో వాలని బీజేపీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో పాతబస్తీతో పలు సామాజిక సేవా కార్యక్రమా లు చేపడుతోన్న మాధవి లత పేరును బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసిన విషయం విధితమే.
హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని పలు దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీ కైవసం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు సలావుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు.
దీంతో ఆ పార్టీకి ఈ నియో జకవర్గానికి కంచుకోటగా మారింది. అలాంటి వేళ హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకో నేందుకు బీజేపీ అగ్రనా యకత్వం సైతం మాధవి లతను బరిలో దింపి వ్యూ హాత్మకంగా అడుగులు వేసింది.
అలాంటి వేళ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ సైతం బలమైన అభ్యర్థిని రంగం లోకి దింపే అవకాశాలు ఉన్నాయని.. దాంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది.
అలాంటి సమయంలో సానియా మిర్జాను రంగం లోకి దింపే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ సైతం సాగుతోంది. అదీకాక సానియా మిర్జాకి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ కురాలు సోనియా గాంధీతో సన్నిహిత సంబంధాలున్న సంగతి అందరికీ తెలిసిందే
Mar 28 2024, 17:18