బాసగూడెం లో ఎన్ కౌంటర్ ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఆరుగురు మృతి
•పోలీసులకు లొంగిపోయిన దళ సభ్యుడు
చర్ల సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపురు బట్టి సమీప తాలి పేరు నది ఒడ్డున బుధవారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఆరుగురు మృతి చెందినట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
మృతులను.. మిలీషియా సెక్రటరీ కమాండర్ మూక, ఏసీఎం నగేష్, అతని భార్య సోనీ, ఏసీఎం మిలీషియా సీప్ వికాస్, ఏసీఎం గనజి, సుక్కగా పోలీసులు గుర్తించారు.
హోలీ పండుగ రోజు ముగ్గురు గ్రామీణు లను మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఆచూకీ కోసం కోబ్రా 210, 205, సీఆర్పీఎఫ్ 229 బెటాలి యన్, డీఆర్జీ బలగాలు బాసగూడ అడవులను జల్లెడ పట్టాయి.
ఈ క్రమంలో చీపురు బట్టి సమీప అడవిలో మావోయి స్టులు తారసపడి విచక్ష ణారహితంగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని, ఆత్మ రక్షణ కోసం బలగాలు సైతం ఎదురుకాల్పులు జరపడంతో ఆరుగురు మావోయిస్టులు చనిపో యారని తెలిపారు.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ప్లాటూన్ నెంబర్ 10 కమిటీ కమాండర్ రమేష్, అతని భార్య సోనీ మృతుల్లో ఉన్నారని ఎస్పీ ధ్రువీకరించారు. రెండు మూడు గంటల పాటు ఏకధాటిగా జరిగిన ఎన్‌కౌంటర్ లో ఒక దళ సభ్యుడు లొంగిపోగా అనంతరం ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు తుపాకులు, మందు గుండు సామగ్రి, మావోయిస్టుల విప్లవ సాహిత్యం భారీగా లభించిందని ఎస్పీ తెలిపారు.
Mar 28 2024, 11:23