హైదరాబాద్,బేగంపేట్‌లో కాల్పుల కలకలం..
ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు.
ఇద్దరు అగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు.
తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చేరుబడ్డట్టు గుర్తించిన పోలీసులు.
రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న నార్త్ జోన్ డిసిపి రోహిణి ప్రియదర్శిని.
చడీచప్పుడు లేకుండా ఇంట్లోకి దూరిన అజ్ఞాత వ్యక్తి.. ఎవరు నువ్వు అని తల్లికూతుళ్లు అడగ్గా..
హైదరాబాద్ బేగంపేటలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. గన్‌తో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో తల్లీకూతురు విరోచితంగా పోరాడారు. దొంగల్ని తరిమితరిమికొట్టారు.
తుపాకీతో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో విరోచితంగా పోరాడి బడిత పూజ చేశారు తల్లీకూతుర్లు. తుపాకీ, కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి.. బెదిరించినా బెదరకుండా దొంగల భరతం పట్టారు.
ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. మాస్క్, హెలిమెంట్, చేతితో కత్తి, తుపాకీతో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు తల్లీకూతుర్ని బెదిరించి.. బంగారం, నగదు కొట్టేయ్యాలని ప్లాన్ చేశారు.
గన్‌తో బెదిరింపులకు పాల్పడినా ఏమాత్రం బెదరకుండా దుండగుడితో విరోచితంగా పోరాటం చేసి.. జుట్టుపట్టుకొని ఒక దొంగను ఇంటిబయట ఈడ్చిపడేసింది.
అతని దగ్గర తుపాకీ లాక్కోని చితకొట్టింది. తల్లికితోడుగా కూతురు కూడా దొంగపై దాడి చేయడంతో పరుగు తీశారు. తర్వాత ఇంట్లో ఉన్న మరో దొంగను కూడా పరిగెత్తించి కొట్టారు తల్లికూతుళ్లు.
ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. గతంలో దీపావళి టైంలో జైన్ ఇంట్లో క్లీనింగ్ కోసం వచ్చారని చెబుతున్నారు ఆర్‌కే జైన్ భార్య. ఇంటి గుట్టు తెలుసుకొని సంవత్సరం తర్వాత దొంగతనానికి ప్లాన్ వేశారని పోలీసులు చెప్పారు. నిందితులనుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
ఆర్ కే జైన్ మేడ్చల్ లో ఓ పరిశ్రమ నడుపుతున్నారు. మరోవైపు తల్లీకూతురు దుండగుడితో పోరాడిన వీడియో సోషల్ మీడియాలోను వైరల్‌గా మారింది.
Mar 23 2024, 20:11