రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి..40 మందికిపైగా మృతి
రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. స్థానిక అతి పెద్ద సంగీత కచేరీ హాలు లోకి ప్రవేశించిన దుండ గులు పౌరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో 40 మందికి పైగా మరణించారని, దాదా పు 100 మంది గాయపడ్డా రని రష్యా వార్తా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
మొత్తం 6, వేల మందికిపైగా సామర్థ్యమున్న క్రాకస్ సిటీ హాలులో రష్యాలోనే ప్రము ఖ బ్యాండ్ అయిన ‘పిక్‌నిక్’ సంగీత కార్యక్రమం జరుగు తోంది,రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్లాది మిర్ పుతిన్ దీంతో అభి మానులు పెద్దఎత్తున పోటెత్తారు.
ఇదే అదనుగా దుండగులు రెచ్చిపోయారు. తొలుత పేలుళ్లకు, ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. దీంతో మంటలు చెలరే గాయి. ఇది ఉగ్రవాద చర్యేనని రష్యా దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
దాడిలో అనేక మంది ముష్కరులు పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తు న్నాయి. బాంబుల దాడిలో మంటల తీవ్రతకు క్రాకస్ సిటీ హాలు పైకప్పు కుప్పకూ లినట్టు తెలుస్తుంది. మృతు ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికా రులు వెల్లడించారు.
Mar 23 2024, 08:47