ఉత్కంఠ పోరులో బెంగళూరు పై చెన్నై సూపర్ కింగ్ తొలి విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించింది. 174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొం దింది.
తొలి బంతినుంచే బౌండరీల తో దూకుడుగా ఆడిన సీఎస్‌కే… వికెట్లు పడుతున్న రన్‌రేట్ పడిపోకుండా ఆడింది. దీంతో 4 వికెట్ల నష్టానికి 18.4 ఓవర్లలోనే టార్గెన్‌ను చేధించింది.
రుతురాజ్ గైక్వాడ్ (15), రచిన్ రవీంద్ర (37), అజింక్యా రహానే (27), డారిల్ మిచెల్ (22), శివమ్ దూబే 34 నాటౌట్, రవీంద్ర జడేజా 25 నాటౌట్ ఆకట్టుకున్నారు.
ఇక ఆర్సీబీతో బౌలర్లలో కామెరాన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. కర్ణ్ శర్మ, యశ్ దయాళ్ చరో వికెట్ దక్కించుకున్నారు.
అంతక ముందు ఆర్సీబీ బ్యాటింగ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రజత్, మ్యాక్స్‌వెల్ వరుసగా డకౌట్ అయ్యి నిరాశపర్చారు. కోహ్లీ 21 పరుగులు, కెమరాన్ గ్రీన్ 18 పరుగులు చేసి వెనుదిరిగారు.
ఇక అనుజ్ రావత్ (48) పరుగులతో చెలరేగగా.. దినేష్ కార్తీక్ (38- నాటౌట్) పరుగులతో ఆకట్టుకున్నా డు. సీఎస్‌కే బౌటర్లలో దీపక్ చాహర్ ఒక వికెట్ దక్కించు కోగా… ముస్తాఫిజుర్ రెహ మాన్ 4 వికెట్లతో మెరిసా డు. కాగా, 174 పరుగల టార్గెట్‌తో చెన్నై జట్టు బరిలోకి దిగనుంది.
ఇక రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో అరుదైన రికా ర్డు నమోదు చేశాడు. ఈ ఫార్మాట్ చరిత్రలోనే 12 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కోహ్లీ 21 పరుగులు చేశాడు.
Mar 23 2024, 08:46