ఎమ్మెల్సీ కవితను ఐదో రోజు విచారించిన ఈడీ ఆధికారులు
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఐదో రోజు ఈడీ ఆధికారులు విచారించారు. ఇవాళ సుప్రీంకోర్టులో బెంచ్ మీదకు కవిత రిట్ పిటిషన్ విచారణకు రానున్నది.
లిక్కర్ కేసులో కీలక విష యాలను రాబట్టడంలో భాగంగా ఆగస్ట్ 22న ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది.
నాలుగో రోజు కవిత పీఏలు రాజేష్, రోహిత్ లను విచా రించారు..
ఈడీ అధికారులు. కవిత అరెస్ట్ సమయంలో పీఏల ఫోన్లను సీజ్ చేయిం చిన అధికారులు.. ఫోన్లు అన్ లాక్ చేయించి అందులోని డేటా ఆధారంగా ప్రశ్నించింది.
మరో వైపు తన అరెస్టు అంశంలో ఈడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించా రంటూ కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు.
ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండా ఈడీ అరెస్ట్ చేసిందని తన పిటిషన్ లో తెలిపారు.
Mar 22 2024, 09:23