టెట్... టఫ్.. మాకొద్దు
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్,కాకుండా, తమ కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యా యులు కోరుతున్నారు.
దీని కోసం పలు ఉపాధ్యా య సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయను న్నట్టు ప్రభుత్వం నిర్ణయిం చిన విషయం తెలిసిందే.
ఈ డీఎస్సీ పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణ యించి, షెడ్యూల్ ప్రకటిం చింది. దాని ప్రకారం అభ్య ర్థులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు సమ ర్పించాలి. టెట్‌ను కంప్యూ టర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ, పద్ధతిలో మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహించ నున్నారు.
ఫలితాలను 20లోపు ప్రక టించనున్నారు. ఈ టెట్ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 20న జారీ చేయా ల్సి ఉంది. కానీ కొన్ని సాంకే తిక కారణాల వల్ల నిలిచిపో యింది. ఒకటి రెండు రోజు ల్లో విడుదల చేస్తామని అధి కారులు చెబుతున్నారు.
అయితే ఈ టెట్‌పై ఉపాధ్యా యులు కొంత అసంతృప్తితో ఉన్నారు. 2010 తర్వాత ఉపాధ్యాయులుగా ఎంపి కైన వారు కచ్చితంగా టెట్ పాసై ఉండాలనే నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టెట్ సర్టిఫికెట్ ఉంటేనే వారికి పదోన్నతులు కల్పించనున్నారు.
రాష్ట్రం లో చాలామంది ఉపాధ్యా యులకు టెట్ సర్టిఫికెట్ లేదు. దాంతో వారికి పదోన్నతులు నిలిపి వేశారు. ఇలాంటి ఉపాధ్యా యులు ప్రస్తుతం ప్రకటించిన టెట్ రాసి, ఉత్తీర్ణులు కావా లని ప్రభుత్వం సూచిస్తోంది.
అయితే ఈ టెట్‌లో తాము ఉత్తీర్ణత సాధించలేమని, తమ కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దీనికి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేన్,ఎన్‌సీటీఈ నిబంధనలు అంగీకరిం చవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిగా మారింది...
Mar 22 2024, 09:19