తమిళనాడు ఎన్నికల బరిలో: మాజీ గవర్నర్ తమిళ్ సై
తెలంగాణ గవర్నర్‌గా పని చేసి కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసిన తమిళసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నట్టు తెలిసింది..
భారతీయ జనతా పార్టీ బీజేపీ గురువారం విడుదల చేసిన మూడవ జాబితాలో తమిళనాడులోని 9 స్థానా లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఫైర్‌బ్రాండ్ నేత తమిళనాడు బీజేపీ అధ్యక్షులు కే. అన్నామలై కోయంబత్తూరు నియోజ కవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు.
కేంద్ర మంత్రి డా. ఎల్. మురుగన్ నీలగిరీస్ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి పొన్ రాధా కృష్ణన్ కన్యాకుమారి నుంచి పోటీ చేస్తున్నారు.
వెల్లూరు నుంచి డా. ఏసీ షణ్ముగన్, చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పి సెల్వన్, కృష్ణగిరి నుంచి సి. నరసిం హన్, పెరంబలూరు నుంచి టీఆర్ పారివేంధర్, తిరునె ళ్వేలి నుంచి నైనార్ నాగేం ద్రన్ పేర్లను బీజేపీ అధిష్టా నం ప్రకటించింది.
తమిళనాడుతో ఎన్డీఏ మిత్రపక్షాలతో సీట్ల సర్దు బాటు అనంతరం బీజేపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపి కపై కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది.
Mar 22 2024, 09:18