ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసింది. ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి తర లించారు.
ఈ సందర్భంగా ఆప్ కార్య కర్తలు అడ్డుకోబోగా.. పోలీ సులు వారిని చెదరగొట్టారు. గురువారం ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి మినహాయింపు నిరాకరిం చిన కొద్ది సేపటికే సెర్చ్ వారెంట్‌తో ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న 12 మంది ఈడీ అధికారుల బృందం సోదాలు ప్రారంభించింది.
విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం మొదటి నుంచీ జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు.. శాంతిభద్రత ల సమస్య తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్ ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు.
ఆప్ నేతలు, కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి వద్దకు వచ్చినా.. వారందరినీ భద్రతా సిబ్బంది నిలువ రించింది. లిక్కర్ స్కాం మనీలాండరింగ్ వ్యవహా రంలో తొమ్మిది సార్లు విచారణకు రావాలని పిలిచినా హాజరయ్యేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు.
మరోవైపు తనపై బలవం తపు చర్యలు తీసుకోకుండా దర్యాప్తు సంస్థలకు ఆదేశా లివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపు చ్చింది. దీంతో ఈడీ అరెస్టు చేసింది..
Mar 22 2024, 07:39