పాలీసెట్ పరీక్ష తేదీలో మార్పు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో వివిధ ప్రవేశ పరీక్షల తేదీల్లో అధికారులు మార్పు లు చేర్పులు చేస్తున్నారు. మే 13వ తేదీన ఎన్నికలున్న క్రమంలో ఆ రోజు, ముందు రోజు, తర్వాతి రోజుల్లో ఉన్న పరీక్షల తేదీలను మారుస్తున్నారు.
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలిసెట్, తేదీని మే 17 నుంచి మే 24వ తేదీకి వాయిదా వేశారు. ఈమేరకు బుధవారం సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి పుల్లయ్య ప్రకటన చేశారు.
ఇక ఎప్‌సెట్‌కు కూడా ఒకటి, రెండ్రోజుల ముందుగానే ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాద నలను పంపించారు. సర్కారు అనుమతినివ్వ గానే... కొత్త తేదీలను ప్రకటించనున్నారు.
ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ మేరకు.. మే 9, 10వ తేదీల్లో ఇంజనీరింగ్, 11, 12వ తేదీల్లో అగ్రికల్చ ర్, ఫార్మసీ పరీక్షలను నిర్వ హించాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో కొంత ముందు గానే.. మే 7 లేదా 8వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల ఏప్రిల్,మూడో వారంలో ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలా ఖరు నాటికి స్పాట్ వాల్యు యేషన్‌ను పూర్తి చేయను న్నారు.
తర్వాత అన్నీ సక్రమంగానే ఉన్నయా లేదా అనేది పరిశీలించి ఫలితాలను ప్రకటించనున్నారు...
Mar 22 2024, 07:37