ఈడీ అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన కవిత
•రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీట్రయల్ కోర్టు కస్టడీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ రేపు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ముందుకు విచారణకు రానుంది.
ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.
ఈ మేరకు సుప్రీంకోర్టు విచారణ జాబితాలో కవిత పిటిషన్‌ను చేర్చింది. తన అరెస్ట్ అక్రమమని, కస్టడీ రాజ్యాంగ విరుద్ధ మంటూ సోమవారం 537 పేజీలతో కవిత పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్, పిటిషన్ పై విచారణ, కోర్టు ఉత్తర్వుల కాపీలు, మీడియా పబ్లిష్ చేసిన కథనాలను కవిత జత చేశారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిం దని, పొలిటికల్ ఎజెండాతో ఈడీ అధికారులు పని చేస్తున్నారని తన పిటిష న్‌లో కవిత ఆరోపించారు.
చట్టవ్యతిరేకంగా, కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్ చేశారని మెన్షన్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమ లులో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి కేసు తనపై లేదన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఈ అంశాలను పరిగ ణన లోకి తీసుకొని తాజా పిటి షన్‌పై తుది తీర్పు వెలువ డేవరకు తక్షణమే తనను విడుదల చేసేలా ఆదేశాలి వ్వాలని కోరారు. అలాగే ప్రస్తుత అరెస్ట్ పై స్టే విధిస్తూ, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
Mar 21 2024, 12:37