నాలుగవ రోజు ఎమ్మెల్సీ కవితను విచారించనున్న ఈడీ అధికారులు
లిక్కర్ స్కాం కేసు లో ఆరో పణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను నాలుగో రోజు బుధవా రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్ట రేట్ అధికారులు కస్టడీ లోకి తీసుకుని విచారించను న్నారు.
ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యా లయం ప్రవర్తన్ భవన్‌లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీలాండ రింగ్ కేసులో కవిత పాత్ర.. రూ.100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడి యా కేజ్రీవాల్‌తో ఒప్పందా లు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు.
రోజులో 6-7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్ లో కవిత భోజనం చేస్తు న్నారు.
ఈడీ కస్టడీలో ఉన్న కవిత.. తన తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమ ణులు అఖిల సౌమ్య, విను త, సోదరుడు ప్రశాంత్‌ను కలుసుకు నేందుకు అను మతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను మంగళవారం ఆమె సోదరుడు కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు.
కేసుకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించి నట్టు తెలిసింది. కవిత తల్లి శోభ బుధ, గురువారాల్లో ఢిల్లీకి రానున్నట్టు సమాచా రం. కాగా, రోజురోజుకూ కవిత విచారణ సమయాన్ని ఈడీ పెంచుతోంది.
మంగళ వారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, భోజన విరామం తర్వాత మధ్యా హ్నం 2 నుంచి 4.15 వరకు ప్రశ్నించినట్టు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపు టీ విరామం ఇచ్చి, మళ్లీ విచారణను ప్రారంభించి నట్టు తెలిసింది.
అందుకే, ప్రతిరోజూ 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలి సేందుకు అవకాశం ఇవ్వగా, మంగళవారం మాత్రం 7 తర్వాత అనుమతిం చారు....
Mar 21 2024, 12:36