/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: మీడియా సెంటర్ ను ప్రారంభించిన DRO Mane Praveen
NLG: మీడియా సెంటర్ ను ప్రారంభించిన DRO

నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచురితమయ్యే రాజకీయ ప్రకటనల పరిశీలన, పెయిడ్ న్యూస్ పరిశీలన కై మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి తెలిపారు. 

పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ మరియు మీడియా సెంటర్ ను DRO బుధవారం జిల్లా కలెక్టర్ హరిచందన ఆదేశాల మేరకు ప్రారంభించారు.

NLG: ప్రవస్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

నల్లగొండ: ప్రవస్తిక ఫౌండేషన్ చైర్మన్ బండారు కవిత గిరిధర్ ఆధ్వర్యంలో, పట్టణంలో మంగళవారం కీ.శే. ప్రవస్తిక ప్రథమ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్దులకు ఆహారపు ప్యాకెట్లు అందజేశారు.

ప్రవస్తిక ఫౌండేషన్ చైర్మన్ కవిత గిరిధర్ మాట్లాడుతూ.. తమ కుమార్తె ప్రవస్తిక, గత సంవత్సరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉండగా, గత సం. మార్చి 19న అనారోగ్య కారణంగా ఆకస్మికంగా మరణించింది. ప్రవస్తిక జ్ఞాపకార్థం ఆమె పేరు మీద ప్రవస్తిక ఫౌండేషన్ స్థాపించి, తమ సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చిట్టితల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలో తమ కూతుర్ని చూసుకుంటున్నామని తెలిపారు.

NLG: ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు: జిల్లా ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు

NLG: ఈ రోజు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ ముదిరాజ్ జన్మదినం సందర్భంగా, నల్గొండ జిల్లా ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు కుంభం సూర్య ముదిరాజ్ ఈటెల రాజేందర్ ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండలో సూర్య ముదిరాజ్ మాట్లాడుతూ.. మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కు ముదిరాజ్ బిడ్డలందరూ మద్ధతు ఇవ్వాలని కోరారు.

TG: తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి రాధాకృష్ణన్*

హైదరాబాద్ :

తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో, ఝార్ఖండ్ గవర్నర్ సి.పి రాధాకృష్ణన్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించారు.

ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త గవర్నర్ ను నియమించేందుకు వీల్లేదు. దీంతో రాధాకృష్ణన్ కే తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.

ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక బాధ్యతల్ని కూడా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి రాధాకృష్ణన్ కే ఇచ్చారు.

TS: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మెదక్ రూరల్ కానిస్టేబుల్

మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బి .సురేందర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కాడు. ఓ ఇసుక ట్రాక్టర్ సీజ్ చేయగా మైనింగ్ శాఖ నుంచి రిలీజ్‌కు అనుమతిచ్చారు. స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సంగారెడ్డి డీఎస్పీ ఆధ్వర్యంలో డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్‌ ను పట్టుకుని విచారిస్తున్నారు.

NLG: పర్యావరణ క్యాలెండర్ ఆవిష్కరించిన పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు

నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ.. ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం (ఐఈఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక, పర్యావరణ అంశాలతో కూడిన ప్రకృతి దినాలను పొందుపరిచి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థకు అభినందనలు తెలిపారు.  

కార్యక్రమంలో సహాయ పర్యావరణ ఇంజనీర్ ఎండి సజీనా బేగం, సహాయ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.పురుషోత్తం రెడ్డి, డాక్టర్ యం.రామకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది రహిమ, కె.నాగరాజు, విజిత, తదితరులు పాల్గొన్నారు.

NLG: చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి వివరించిన సూపర్వైజర్ పద్మ

నల్లగొండ జిల్లా:

గట్టుప్పల్: మండలం అంతం పేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. చిరుధాన్యాల ఉపయోగము, ప్రాథమిక విద్య, రెండు సం. లోపు పిల్లలకు అందించాల్సిన పోషకాహారం గురించి వివరించారు. దేవులపల్లి తండాలో చిరుధాన్యాలతో పోషకాహారం తయారు చేయించి బహుమతులు అందజేశారు. అంగన్వాడీ టీచర్లు కలమ్మ, అంబిక, యాదమ్మ, సునీత, శారద, మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో స్వచ్ఛ గ్రంథాలయ కార్యక్రమం

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ మహిళా యూనిట్-4 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి మరియు గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో, ఈ రోజు స్వచ్ఛ గ్రంథాలయ కార్యక్రమం నిర్వహించారని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్ తెలిపారు .

ఎన్ఎస్ఎస్ మహిళా యూనిట్-4 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. స్వచ్ఛ గ్రంథాలయం కార్యక్రమం లో గ్రంథాలయం ముందు మరియు గ్రంథాలయ పరిసరాలలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను వాలంటీర్లు తీసివేశారు అని మన కళాశాల మన గ్రంథాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.

కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు, పత్రికల విభాగం ఒక క్రమ పద్ధతిలో ఎన్ఎస్ఎస్ విద్యార్థినిలు అమర్చారు. రీడింగ్ హాల్ ఆవరణలో అనవసరమైనటువంటి చెత్త ను తీసివేశారు. ఆ తరువాత గ్రంథాలయం ముందున్నటువంటి గార్డెన్ లో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పెట్టారు. మన కళాశాల మన గ్రంథాలయం స్వచ్ఛ గ్రంథాలయంగా ఉండాలని అటువంటి ఉద్దేశంతో ఈరోజు కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినిలు ఈ యొక్క జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని గ్రంథాలయాన్ని మరియు గ్రంధాల ఆవరణంలో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగుల వేణు, మణెమ్మ అసిస్టెంట్ లైబ్రేరియన్, సూదిని వెంకట్ రెడ్డి లైబ్రరీ రికార్డు అసిస్టెంట్, రేణుక మరియు ఎన్ఎస్ఎస్ మహిళా విభాగం యూనిట్-4 విద్యార్థినిలు పాల్గొని ఈ స్వచ్ఛ గ్రంథాలయం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

NLG: మల్లు స్వరాజ్యం కు జోహార్లు అర్పించిన సిపిఎం పార్టీ

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: మండల సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ మల్లు స్వరాజ్యం రెండో వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. కామ్రేడ్ స్వరాజ్యం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, తుపాకీ పట్టి ముందుండి పేద ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన వీరనారి అని కొనియాడారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో భూస్వామి కుటుంబంలో జన్మించిన ఆమె చిన్ననాటి నుండి ఎర్రజెండా భుజాన వేసుకొని భూస్వాములకు వ్యతిరేకంగా రజాకారులతో పోరాటం చేసిన వీరవనిత జమీందారు రజాకార్లను గడగడలాడించిన వీరవనిత మల్లు స్వరాజ్యం. తుంగతుర్తి నియోజకవర్గ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే పనిచేశారు. ఆమె ఆశయ సాధన కోసం యువతరం ఆమె అడుగు జాడల్లో నడవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎడ్ల నరసింహ రాజు నాయక్, మల్లేష్, రాజు, వెంకటయ్య తదితరులు పాల్గొని జోహార్లు అర్పించారు.

NLG: కొండమల్లేపల్లి నూతన తహశీల్దారు గా అనురాధ

కొండమల్లేపల్లి నూతన తహశీల్దారు గా అనురాధ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు కొండమల్లేపల్లి తహశీల్దారు గా ఉన్న దివ్యారెడ్డి హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న అనురాధ కొండమల్లేపల్లి కి బదిలీపై వచ్చారు.