/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కాంగ్రెస్ రెండో జాబితా ; ఇదేనా ❓️ Yadagiri Goud
కాంగ్రెస్ రెండో జాబితా ; ఇదేనా ❓️

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబం ధించి రెండో విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది.

నిజామా బాద్- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,

ఆదిలాబాద్- డాక్టర్ సుమలత,

కరీంనగర్- ప్రవీణ్ రెడ్డి,

వరంగల్- పసునూరి దయాకర్,

చేవెళ్ల- రంజిత్ రెడ్డి,

మల్కాజ్ గిరి- సునీతా మహేందర్ రెడ్డి,

నాగర్ కర్నూల్- మల్లు రవి,

పెద్దపల్లి- గడ్డం వంశీల

పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

హోమ్ ఓటింగ్‌కు నోటిఫికేషన్ జారీ..

త్వరలో జరగనున్న ఎన్ని కలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కోసం ఈసీ నోటిఫి కేషన్ మంగళవారం విడు దల చేసింది.

మే 13న జరగనున్న ఎన్ని కల్లో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, శారీరక వైకల్యం ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫార్మ్ -12 సమర్పిం చాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే ఈ హోమ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అనుమతినిస్తారు.

పోలింగ్ తేదీ 13వ తేదీకి పది రోజుల ముందు నుంచి ఇంటి నుంచే ఓటు వేయ వచ్చు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసిన ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్సుల్లో ఉంచుతారు..

ప్రణీత్ రావు కేసులో తీగలాగుతున్న పోలీసులు : కదులుతున్న రాజకీయ లింకులు

తనకున్న పలుకుబడితో ప్రమోషన్లు ఇప్పిస్తానంటూ ఎరవేసి మెరికల్లాంటి ఉద్యో గులతో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌రావు.. వేల ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసినట్టు ఇప్పటికే గుర్తిం చారు.

కూపీలాగిన కొద్దీ లింకులు కదలుతున్నాయి. ట్యాపింగ్‌ ఎపిసోడ్‌లో ప్రణీత్‌కు సహక రించిన వరంగల్‌కు చెందిన ఇద్దరు సీఐలను కూడా ప్రశ్నిస్తోంది స్పెషల్‌ టీమ్‌. గతంలో ఈ ఆ ఇద్దరు ప్రణీత్‌ టీమ్‌లో కీలకంగా పనిచేసినట్టు గుర్తించారు పోలీసులు.

వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ నాయకుడి ఆదేశాల మేరకే ఫ్రణీత్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారా? విచారణ ఫ్రేమ్‌లో తెరపైకి వచ్చిన ఈ ప్రశ్న పొలిటిక‌ల్‌‌గా కలకలం రేపింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పందించారు.

ఫోన్‌ట్యాపింగ్‌తో తనకే సంబంధంలేదన్నారు. తన పేరు చెప్పాలంటూ ప్రణీత్‌ రావును బెదిరిస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి. ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని స్పష్టం చేశారు దయాకర్‌రావు.

ఇక, విచారణలో బాగంగా బంజారాహిల్స్‌ పీఎస్‌లో ప్రణీత్‌రావును వైడ్‌ యాంగి ల్‌లో ప్రశ్నించింది స్పెషల్‌ టీమ్‌. గత ఆరేళ్లుగా ప్రణీత్‌ ఎలాంటి ఆపరేషన్స్‌ నిర్వ హించారో ఆరా తీశారట.

అలాగే ఎవరి ఆదేశాలతో ఫోన్‌ ట్యాపింగ్‌? టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను ధ్వంసం చేయ డం వెనక కారణాలేంటి? ట్యాపింగ్‌ చేసిన కాల్‌ రికార్డ్స్‌ను ఎవరికి ఎందుకు పంపించారు? అనే ప్రశ్నలు సంధిస్తూ కీలక డేటా సేక రించినట్టు తెలుస్తోందట.

ఇక, ప్రణీత్‌ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా మరింత లోతుగా ఎంక్వయి రీ చేస్తున్నారు ప్రత్యేక బృం దం పోలీసు అధికారులు.

హైదరాబాద్ జిల్లాలలో విస్తృత తనిఖీలు

ఎన్నికల నోటిఫికేషన్‌ విడు దలైన నేపథ్యంలో ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ బృందాలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రత్యేక నిఘా ఉంచాయి. ఇందులో భాగంగా పోలీస్‌, ఎస్‌. ఎస్‌.టి, ఎఫ్‌.ఎస్‌.టి టీమ్‌లు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

నగరంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 24 గంటలపాటు 9 టీంలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో మూడ్రోజుల్లోనే రూ.35లక్షలకుపైగా స్వాధీనం చేసుకున్న ఈ బృందాలు, విలువైన వస్తువులను సీజ్‌ చేశాయి. మంగళవారం ఒక్కరోజే రూ.16,43,300తోపాటు రూ.10,250 విలువగల వస్తువులను సీజ్‌ చేశారు.

హైదరాబాద్‌ జిల్లాలో ఎఫ్‌. ఎస్‌.టీ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు రూ.9,30,000 సీజ్‌ చేయగా, పోలీసులు మరో రూ.7,13,300ను పట్టుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.17,25, 311 విలువగల వస్తువుల ను పట్టుకున్నారు. 54.67 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని.. 8 మందిని ప్రోహిబిషన్‌ కేసుల్లో అరెస్టు చేశారు.

మంగళవారం నగదు, ఇతర వస్తువులపై 5 ఫిర్యాదులు రాగా.. పరిశీలించి పరిష్క రించారు. ఇప్పటి వరకు వరకు 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

ఏపీ, తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు, పరీక్ష ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష ఫలితాలు..

ఏపీ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం

ఏపీ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో

ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు: మే 13 నుంచి19 వరకు

ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు: మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు

తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు :పరీక్ష ఫలితాలు

తెలంగాణ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలు: జులై 17 నుంచి 31 వరకు

తెలంగాణ టెట్‌ 2024 పరీక్షలు: మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు

టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్‌ 9, 2024.

టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీ: అక్టోబర్‌ 21, 2024.

తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు: మే 9 నుంచి 12 వరకు

తెలంగాణ RDC CET-2024 పరీక్ష: ఏప్రిల్ 28, 2024.

తెలంగాణ పీజీఈసెట్‌ – 2024 పరీక్ష తేదీ: జూన్‌ 6 నుంచి జూన్‌ 9 వరకు, 2024.

తెలంగాణ ఐసెట్‌-2024 పరీక్ష తేదీ: జూన్‌ 4, 5 తేదీల్లో, 2024

తెలంగాణ లా సెట్‌-2024 పరీక్ష తేదీ: జూన్‌ 3, 2024

అఖిల భారత ప్రవేశ పరీక్షల తేదీలు

సీయూఈటీ (యూజీ) – 2024 ప్రవేశ పరీక్ష: మే 15 నుంచి 31 వరకు, 2024.

నీట్‌ యూజీ 2024 పరీక్ష ఫలితాల తేదీ: జూన్‌ 14, 2024

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇచ్చే అవకాశం ఉంది.

యోగా బాబాకు నోటీసులు ; కోర్టుకు హాజరుకండి

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్‌ బాబాను, ఆయన యాజమాన్యంలోని పతం జలి ఆయుర్వేద్‌ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.

ఆరోగ్య రక్షణకు సంబంధిం చి పత్రికలలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ వీరిద్దరిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలిపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి.

వీటిపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సంద ర్భంగా ఇకపై అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని ఆ సంస్థ హామీ ఇచ్చింది. అయితే దానిని విస్మరించి, మీడియాలో ప్రకటనలు కొనసాగిస్తూనే ఉన్నారని న్యాయస్థానం తాజాగా అభిప్రాయపడింది.

1954వ సంవత్సరపు డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ అభ్యంతరకర ప్రకటనలు చట్టంలోని సెక్షన్‌ 3, 4ను రాందేవ్‌, బాలకృష్ణ ఉల్లంఘించారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూ ర్తులు హిమా కోహ్లీ, అహ్స నుద్దీన్‌ అమానుల్లా తెలిపారు.

వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధానమివ్వాలని వారి ద్దరినీ జస్టిస్‌ కోహ్లీ ఆదేశిం చారు. రాందేవ్‌, బాలకృష్ణ లకు ఫిబ్రవరి 26న సుప్రీం కోర్టు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది.

ఆరోగ్య సంరక్షణకు సంబం ధించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారని అందులో తెలిపింది. గుండె జబ్బులు, ఆస్థమా వంటి వ్యాధులను నయం చేస్తామంటూ ఆధారాలు లేని వాదనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ వ్యాధులకు సంబంధిం చిన ఔషధాల గురించి ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఆ వ్యాపార ప్రకటనలను తొలగించడానికి తీసుకున్న చర్యలేమిటో తెలియజేస్తూ అఫిడవిట్‌ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

గత సంవత్సరం నవంబ ర్‌లో కూడా పతంజలి ఆయుర్వేదపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక వైద్యానికి వ్యతిరేకంగా తప్పుదోవ పట్టించే వాదనలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఇలాంటి ప్రచార కార్యకలాపాలను కొనసాగిస్తే కోటి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇక లేనట్లే

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరుగుతు న్నాయి..

కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దయ్యాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సెలవులను నిషేధిస్తూ జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికలకు సంబంధించిన ఉత్తర్వులు, మెయిల్స్‌, ఇతర సమాచారాన్ని అందించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెలవు దినాల్లో కూడా పని చేయాలని సూచించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండల వేళ.. ఉరుముల వాన

_ఎండల వేళ_.. _ఉరుముల వాన_

_రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణతాపం, ఉక్కపోతతో పాటు తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది._

_కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అసౌకర్య వాతావరణం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు._

నేడు కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్,లోకి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. సోమవారం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరను న్నట్లు ఎక్స్ వేదికగా ప్రవీణ్‌ కుమార్ ప్రకటించారు.

తన రాజకీయ భవితవ్యంపై ఆదివారం వందలాది శ్రేయో భిలాషులు, ఆప్తులు, అభి మానులందరితో మేధోమ ధనం జరిపానని పేర్కొ న్నారు.

ఆ సభలో రకరకాల అభిప్రా యాలు వచ్చాయని, కానీ తన మీద నమ్మకంతో తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ ఎక్స్ వేదిక గా ప్రవీణ్‌కుమార్ హృదయ పూర్వక ధన్య వాదాలు తెలిపారు.

తెలంగాణ విశాల ప్రయో జనాలను దృష్టిలో ఉంచు కొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను సోమవారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నానని వెల్లడించారు.

తాను ఎక్కడున్నా బహు జన మహనీయుల సిద్దాం తాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటానని, వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తానని స్పష్టం చేశారు.

దయచేసి నిండు మనస్సు తో ఆశ్వీరదించండి…జై భీం..జై తెలంగాణ..జై భారత్ అంటూ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు.

సుప్రీం కోర్టుకు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్

ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత అక్రమ అరెస్టును సవాల్‌ చేస్తూ సోమవారం ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో కంటెంప్ట్‌ అఫిడవిట్‌ వేయనున్నారు.

ఈ నెల 19న కవిత కేసు విచారణకు రానున్న నేప థ్యంలో ఈడీ ఆమెను అక్ర మంగా అరెస్టు చేసిందని, అది సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వో న్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.

కాగా, ఆదివారం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారిం చారు.ఇప్పటికే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఈడీ అధికారు లు కవితను అరెస్ట్ చేయ డం నిబంధనలను విరుద్ధ మని కేటీఆర్ ఇప్పటికే ఆరోపించారు.ఇదే విషయం పై ఢిల్లీలో న్యాయవాదులో సంప్రదింపులు జరిపారు.