ప్రణీత్ రావు కేసులో తీగలాగుతున్న పోలీసులు : కదులుతున్న రాజకీయ లింకులు
తనకున్న పలుకుబడితో ప్రమోషన్లు ఇప్పిస్తానంటూ ఎరవేసి మెరికల్లాంటి ఉద్యో గులతో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌రావు.. వేల ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసినట్టు ఇప్పటికే గుర్తిం చారు.
కూపీలాగిన కొద్దీ లింకులు కదలుతున్నాయి. ట్యాపింగ్ ఎపిసోడ్‌లో ప్రణీత్‌కు సహక రించిన వరంగల్‌కు చెందిన ఇద్దరు సీఐలను కూడా ప్రశ్నిస్తోంది స్పెషల్ టీమ్. గతంలో ఈ ఆ ఇద్దరు ప్రణీత్ టీమ్‌లో కీలకంగా పనిచేసినట్టు గుర్తించారు పోలీసులు.
వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకుడి ఆదేశాల మేరకే ఫ్రణీత్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారా? విచారణ ఫ్రేమ్‌లో తెరపైకి వచ్చిన ఈ ప్రశ్న పొలిటికల్‌గా కలకలం రేపింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.
ఫోన్‌ట్యాపింగ్‌తో తనకే సంబంధంలేదన్నారు. తన పేరు చెప్పాలంటూ ప్రణీత్ రావును బెదిరిస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి. ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని స్పష్టం చేశారు దయాకర్‌రావు.
ఇక, విచారణలో బాగంగా బంజారాహిల్స్ పీఎస్‌లో ప్రణీత్‌రావును వైడ్ యాంగి ల్‌లో ప్రశ్నించింది స్పెషల్ టీమ్. గత ఆరేళ్లుగా ప్రణీత్ ఎలాంటి ఆపరేషన్స్ నిర్వ హించారో ఆరా తీశారట.
అలాగే ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్? టెక్నికల్ ఎవిడెన్స్‌ను ధ్వంసం చేయ డం వెనక కారణాలేంటి? ట్యాపింగ్ చేసిన కాల్ రికార్డ్స్‌ను ఎవరికి ఎందుకు పంపించారు? అనే ప్రశ్నలు సంధిస్తూ కీలక డేటా సేక రించినట్టు తెలుస్తోందట.
ఇక, ప్రణీత్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా మరింత లోతుగా ఎంక్వయి రీ చేస్తున్నారు ప్రత్యేక బృం దం పోలీసు అధికారులు.
Mar 20 2024, 08:22