హైదరాబాద్ జిల్లాలలో విస్తృత తనిఖీలు
ఎన్నికల నోటిఫికేషన్ విడు దలైన నేపథ్యంలో ఎన్‌ఫో ర్స్‌మెంట్ బృందాలు గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రత్యేక నిఘా ఉంచాయి. ఇందులో భాగంగా పోలీస్, ఎస్. ఎస్.టి, ఎఫ్.ఎస్.టి టీమ్‌లు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
నగరంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 24 గంటలపాటు 9 టీంలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో మూడ్రోజుల్లోనే రూ.35లక్షలకుపైగా స్వాధీనం చేసుకున్న ఈ బృందాలు, విలువైన వస్తువులను సీజ్ చేశాయి. మంగళవారం ఒక్కరోజే రూ.16,43,300తోపాటు రూ.10,250 విలువగల వస్తువులను సీజ్ చేశారు.
హైదరాబాద్ జిల్లాలో ఎఫ్. ఎస్.టీ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రూ.9,30,000 సీజ్ చేయగా, పోలీసులు మరో రూ.7,13,300ను పట్టుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.17,25, 311 విలువగల వస్తువుల ను పట్టుకున్నారు. 54.67 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని.. 8 మందిని ప్రోహిబిషన్ కేసుల్లో అరెస్టు చేశారు.
మంగళవారం నగదు, ఇతర వస్తువులపై 5 ఫిర్యాదులు రాగా.. పరిశీలించి పరిష్క రించారు. ఇప్పటి వరకు వరకు 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
Mar 20 2024, 08:22