సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత
![]()
యాదాద్రి భువనగిరి జిల్లాలో వయోజన విద్యాశాఖ లోని మాజీ సాక్షర భారత్ మండల, గ్రామ కో-ఆర్డినేటర్లను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాక్షర భారత్ వలిగొండ మండల అధ్యక్షులు బుగ్గ బీరప్ప మాట్లాడుతూ.. సాక్షర భారత్ కార్యక్రమాలలో పనిచేసిన గ్రామ ,మండల కోఆర్డినేటర్లు పూర్తిస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులుగా 2010 నుండి 2018 మార్చి 31 వరకు అనగా తొమ్మిది సంవత్సరాలు అక్షరాస్యత కార్యక్రమాలతో పాటు ,అన్ని రకాల ప్రభుత్వ, సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రభుత్వానికి సేవలు అందించామని అన్నారు. ప్రభుత్వం తిరిగి సాక్షర భారత్ కోఆర్డినేటర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ .భాగ్యలక్ష్మి, ఏం మాధవి ,జి మానస , పీ లత ,కే లూర్దమ్మ,సిహెచ్ జ్యోతి, ఆర్ అనిత , జ్ సువర్ణ ,కే చైతన్య ,ఎం ధనమ్మ ఎం అనిత ,తదితరులు పాల్గొన్నారు.
![]()
![]()




ఈ షీల్డ్ టెండర్లను శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుమీద చెల్లుబాటు ఉండేలా ఈ షీల్డ్ టెండర్ లో పాల్గొనే టెండర్దారులు 10000/- లో రూపాయలు ధరావత్తుతో డిడి రూపంలో గానీ నగదు రూపంలో గానీ చెల్లుబాటు అయ్యేవిధంగా షీల్డ్ టెండర్లులో పాల్గొనాలని టెండర్ షెడ్యూల్ ధర 2000/- రూపాయలుగా ఉంటుందని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇవో మోహన్ బాబు కోరారు. ఈ టెండర్ల కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుందని తేది.01.04. 2024 నుండి తేది.31.03 2025 వరకు ఈ టెండర్ల కాల పరిమితి ఉంటుందని ఆయన అన్నారు. టెండర్ల లో కావలసిన సామాగ్రి వివరములు 1. పులిహోర కవర్స్ లడ్డు కవర్స్ కోసం టెండర్ 2. కరెంటు సామాగ్రి సరఫరా 3. బ్లీచింగ్ పౌడర్ ఫినాయిల్ సున్నం యాసిడ్ కొబ్బరి పొరకలు తదితర సామాను 4. పండుగలకు బ్రహ్మోత్సవాలకు పూలు పూలదండలు పండ్లు బ్రహ్మోత్సవ సమయంలో ఆలయ అలంకరణ కోసం పూలు వేయటం కొరకు. ఈ టెండర్ వేయడానికి ధరావత్ రూపాయలు 10000/- డిడి రూపంలో నగదు రూపంలో గానీ యూనియన్ బ్యాంక్ వేముల కొండ మరియు కెనరా బ్యాంక్ అరుర్ లలో దేవాదాయ కమిషన్ పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా డీడీలు తీసి టెండర్లో పాల్గొనాలని దేవస్థానం ఇవో సెల్వాద్రి మోహన్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయం సిబ్బంది దేవాలయ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో కిడ్నాప్ మరియు పోస్కో కేసు నమోదు చేసినట్లు శుక్రవారం వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బండారి రాజు తండ్రి యాదగిరి వయసు 33 సంవత్సరాలు , అరూరు గ్రామంలో కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడు ఎర్ర గొల్లపాడు గ్రామం జనగాం మండల్ మరియు జనగాం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు . ఇతన్ని అరెస్టు చేసి క జ్యూడిషల్ రిమాండ్ కొరకు కోర్టు ముందు హాజరు పరిచినట్లు వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.




Feb 26 2024, 15:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
39.3k