దివ్య బాల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రములోని
అనాజిపురం గ్రామ శివారులోని దివ్య బాల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పాఠశాల వ్యవస్థాపకులు ఫాదర్ కాట రాజులు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, గురువులకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. అదేవిధంగా పాఠశాల కరస్పాండెంట్ కాట చిన్నప్ప మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి జీవితానికి తొలి మెట్టు లాంటిదని దానిని నిర్లక్ష్యం చేయకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రభాకర్, జ్యోతి, శ్రీనివాస్, నరేష్, కుమార్ , సుందరి, మోక్ష, మరియదాస్, రమాదేవి, సంధ్యారాణి, అనిత పీఈటీలు రాము , మహేశ్వరి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది.
Feb 24 2024, 11:20