శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెంకటాపురం వారి సీల్డ్ టెండర్ల ప్రకటన
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో తేదీ 28. 2. 00024 నుండి 01.03. 2024 శుక్రవారం మధ్యాహ్నం 11.50 నిమిషంలోపు ఈ టెండర్లు వేయాలి. ఇట్టి టెండర్ల బాక్స్ మధ్యాహ్నం 12 గంటలకు సీల్ చేయబడుతుంది. తదుపరి మధ్యాహ్నం ఒకటి 01.30 నిమిషాలకు దేవస్థానం ఈవో గ్రామ పెద్దల సమక్షంలో ఈ టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతున్నది. కావున భక్తులు టెండర్దారులు దేవస్థానం వారికి కావాల్సిన సామాగ్రి కొరకు షీల్డ్ టెండర్లు వేయగలరని కోరడం జరిగినది.
ఈ షీల్డ్ టెండర్లను శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుమీద చెల్లుబాటు ఉండేలా ఈ షీల్డ్ టెండర్ లో పాల్గొనే టెండర్దారులు 10000/- లో రూపాయలు ధరావత్తుతో డిడి రూపంలో గానీ నగదు రూపంలో గానీ చెల్లుబాటు అయ్యేవిధంగా షీల్డ్ టెండర్లులో పాల్గొనాలని టెండర్ షెడ్యూల్ ధర 2000/- రూపాయలుగా ఉంటుందని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇవో మోహన్ బాబు కోరారు. ఈ టెండర్ల కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుందని తేది.01.04. 2024 నుండి తేది.31.03 2025 వరకు ఈ టెండర్ల కాల పరిమితి ఉంటుందని ఆయన అన్నారు. టెండర్ల లో కావలసిన సామాగ్రి వివరములు 1. పులిహోర కవర్స్ లడ్డు కవర్స్ కోసం టెండర్ 2. కరెంటు సామాగ్రి సరఫరా 3. బ్లీచింగ్ పౌడర్ ఫినాయిల్ సున్నం యాసిడ్ కొబ్బరి పొరకలు తదితర సామాను 4. పండుగలకు బ్రహ్మోత్సవాలకు పూలు పూలదండలు పండ్లు బ్రహ్మోత్సవ సమయంలో ఆలయ అలంకరణ కోసం పూలు వేయటం కొరకు. ఈ టెండర్ వేయడానికి ధరావత్ రూపాయలు 10000/- డిడి రూపంలో నగదు రూపంలో గానీ యూనియన్ బ్యాంక్ వేముల కొండ మరియు కెనరా బ్యాంక్ అరుర్ లలో దేవాదాయ కమిషన్ పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా డీడీలు తీసి టెండర్లో పాల్గొనాలని దేవస్థానం ఇవో సెల్వాద్రి మోహన్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయం సిబ్బంది దేవాలయ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Feb 23 2024, 20:47