తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చాంబర్ కార్యాలయం ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారి ఛాంబర్,కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాదాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి లడ్డు ప్రసాదం ఇచ్చారు.అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు బీర్ల ఐలయ్య గారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
యాదాద్రి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఛాంబర్ లోకి ప్రవేశించారు అనంతరం అర్చకులు ప్రభుత్వం విప్ అలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారికి వేద ఆశీర్వచనం అందజేశారు.
ఈ ఛాంబర్ ప్రారంభోత్సవానికి ఆలేరు నియోజకవర్గం నుండి జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు.ప్రజాపాలనను తెలంగాణ ప్రజలు దివించారు.ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి,ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి,స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి తనను గుర్తించి ప్రభుత్వ విప్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ ఛాంబర్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ ఛాంబర్ ద్వారా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను ప్రతి లబ్ధిదారునికి అందించేందుకు కృషి చేస్తానని బీర్ల ఐలయ్య గారు తెలిపారు.
Feb 23 2024, 18:38