విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిఐఈఓ కి వినతి పత్రం అందజేసిన పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్
భువనగిరి : విద్యార్థులను పరీక్షల టైంలో ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసర్ DIEO రమణి మేడం గారికి వినతిపత్రం ఇచ్చారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ వారు మాట్లాడుతూ విద్యార్థులను పరీక్షల టైంలో చదువుకోనివ్వకుండా ఫీజుల పేరుతో విద్యార్థుల రక్తం తాగుతున్నారు ప్రైవేట్ కాలేజీల యజమాన్యం అలాంటి కాలేజీలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది,,మేడం మాట్లాడుతూ విద్యార్థులను వేధిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటాం హాల్ టికెట్ ఇవ్వకుంటే మా ఆఫీసులో వాళ్ళ ఇంటి పేరు చెప్తే మేమే విద్యార్థులకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి ఇస్తాం టోల్ ఫ్రీ నెంబర్ గిట్ల ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్, నవీన్ చేనేత, తదితరులు పాల్గొన్నారు
Feb 22 2024, 16:59