భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలి ఏఐఎస్ఎఫ్
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటు జరిగి దాదాపు 9 సంవత్సరాలు గడుస్తున్న గత ప్రభుత్వాలు జిల్లా కేంద్రంలో డిగ్రీ మరియు పీజీ కాలేజ్ ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు
జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లేకపోవడంతో జిల్లాలోని నిరుపేద ,మధ్య తరగతి విద్యార్థులు సుదూర ప్రాంతాలైన నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు
ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే గారు సానుకూలంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ జిల్లా నాయకులు రేఖల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
Feb 22 2024, 16:43