జన్వాడ లో మైనారిటీ, దళితులపై దాడిని ఖండిస్తున్నాం: బీఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల పాండు
జన్వాడ క్రైస్తవులపై దాడి ఘటనను ఖండిస్తున్నాం: జిల్లాఅధ్యక్షులు కనకుంట్ల పాండు*
రంగారెడ్డి జిల్లా చేవళ్ల నియోజకవర్గంలోని జన్వడ గ్రామంలో మైనారిటీ,దళిత వర్గాలపై స్త్రీలు,పురుషులపై విచక్షణ రహితంగా దాడి చేసిన రాష్ట్రీయ స్వయం స్వేవక్ సంఘ్ (RSS)కార్యకర్తలు,కాంగ్రెస్ చేసిన దాడిని,బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రిభువనగిరి జిల్లాఅధ్యక్షులు కనకుంట్ల పాండు విలేకరుల సమావేశంలో ఖండిచారు,ఈ సందర్బంగా మాట్లాడుతూ దాడి ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రఅధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అక్రమంగా అరెస్టులు చేశారన్నారు,గత ప్రభుత్వంలో ఇలాగే ప్రశ్నించే గొంతులను నోక్కిన విధంగా అదే ఆనవాయితిని,నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని, ప్రజాస్వామయానికి గొడ్డలిపెట్టు వంటిదని,ఇలాగే కొనసాగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్తారని, రాష్ట్రంలో హోంమంత్రి,విద్యాశాఖకు మంత్రిని కూడా నియమిచలేని అసమర్థ ప్రభుత్వం అని, అరెస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షలు బాసాని మహేందర్,జిల్లారైతువిభాగం అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య,కార్మిక విభాగం అధ్యక్షులు బోల్లేపల్లి అనిల్ కుమార్,ఆలేరు నియోజకవర్గం ఇంచార్జి గందమల్ల లింగస్వామి,భువనగిరి నియోజకవర్గం అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్,ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు గడ్డం శ్రీకాంత్, భువనగిరి నియోజకవర్గం మహిళా నాయకురాలు బాకారం లావణ్య,భువనగిరి మండల అధ్యక్షులు కేతావత్ రవి నాయక్,సోషల్ మీడియా కన్వీనర్ చుక్క సుమన్,తదితరులు పాల్గొన్నారు.
Feb 15 2024, 19:50