ఎన్ హెచ్ ఎం స్కీం లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్
ఎన్ హెచ్ ఎం స్కీం లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం రోజున డిఎం & హెచ్ఓ కార్యాలయంలో ఈ నెల 16 ఫిబ్రవరి 2024న జరిగే దేశవ్యాప్త సమ్మెకు కు సంబంధించిన సమ్మె నోటీస్ ను డి ఈ ఓ లతో కలిసి డిఎంహెచ్ఒ డాక్టర్ ఏ పరిపూర్ణ చారీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ఎన్.హెచ్.ఎం.స్కీమ్ ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనీ , ఎన్. హెచ్.ఎం.ఉద్యోగులకు రెండు నెలల వేతనాలు అనగా డిసెంబర్, జనవరి వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 16వ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా డి.హెచ్ కార్యాలయం కోటి హైదరాబాద్ వద్ద జరిగే ఒక రోజు సమ్మెలో అల్ క్యాడర్స్ ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్. హెచ్. ఎం ఉద్యోగుల క్యాలెండర్ ను డిఎంహెచ్ఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ శిల్పిని, ప్రోగ్రాం ఆఫీసర్ సుమంత్ కళ్యాణ్, ఏ.ఎస్.ఓ జమాల్ షరీఫ్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, డి. ఈ. ఓ లు వినోద్ కుమార్, దుర్గా, సరిత, సౌజన్య, శ్రీదేవి, రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.
Feb 12 2024, 21:31