కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి తరలిరండి: యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం
తెలంగాణ రాష్ట్ర కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి కురుమలు అధిక సంఖ్యలో తరలి రావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గవ్వల నర్సింహులు, రాష్ట్ర కార్యదర్శి డోకె బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, జెడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య పిలుపునిచ్చారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు . ఫిబ్రవరి 18 న మధ్యాహ్నం రెండు గంటలకు కోకాపేట సెజ్ లో కురుమల ఆత్మగౌరవ భవనం (దొడ్డి కొమురయ్య భవన్) ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర రవాణా , బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం లు హాజరవుతారని వారన్నారు. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని కురుమ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమలు, షెఫర్డ్స్, కురుమ కుల పెద్దలు అధిక సంఖ్యలో హాజరై, ప్రారంభోత్సవ కార్యక్రమం ను విజయవంతం చేయాలని వారు కోరారు.
Feb 12 2024, 17:36