సిపిఐ - ఏఐటియుసి పోరాటాల ఫలితమే కొండపైకి ఆటోల అనుమతి: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్
గత రెండు సంవత్సరాలుగా సిపిఐ - ఏఐటీయూసీ పోరాటాల ఫలితమే యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలకు అనుమతి లభించిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి తెలిపారు.
ఆదివారం రోజున యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలను అనుమతించడం పై ఏఐటీయూసీ ఆటో యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ హర్షo వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా యాదగిరిగుట్ట కొండపైకి నడిచే 300 ఆటో కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డాయని అనేక సందర్భాల్లో చేసిన పోరాటాల్లో స్థానిక సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు మరియు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఆటో కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని కొండపైకి తీసుకు వెళ్లడానికి పూర్తిగా సహకారం అందించిన ప్రభుత్వ విప్ స్థానిక ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఏప్పటికైనా పోరాటం విజయం సాధిస్తుందని కార్మికులు తమ హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ ఉద్యమానికి సహకరించిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారికి, సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి గారికి, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు గారికి, ఏఐటీయూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ బోస్, ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశం గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గనబోయిన వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సామల భాస్కర్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు తదితరులు హర్షo వ్యక్తం చేశారు.
Feb 11 2024, 19:56