సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి:తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల, పేద విద్యార్థులు డబ్బులు పెట్టి ప్రైవేటు కళాశాలలో చదవలేక విద్యకు దూరమైతున్నారని తెలియజేశారు. జిల్లాలో 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కానీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు, ప్రభుత్వ పీజీ కళాశాల, అన్ని సబ్జెక్టులతో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో, ఇంటర్మీడియట్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, మెడికల్ కళాశాలలో, పీజీ కళాశాలలో, యూనివర్సిటీలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి, నాణ్యమైన విద్య అందించాలి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి అని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి తెలియజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విద్యార్థిని, విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే మంచి విద్యావంతుడిని విద్యాశాఖ మంత్రిగా నియమించాలని, విద్యాశాఖ బడ్జెట్ 25 శాతం ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు గుద్దేటి శ్యామ్, లింగంపల్లి మధుకర్, మల్లేష్, రవి, మధు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Feb 09 2024, 17:45