TS:భద్రాచలం:చర్ల:దళిత బంధు సాధన కమిటీ పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు
దళిత బంధు సాధన కమిటీ పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు ముసలి సతీష్
చర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద దళిత బంధు సాధన కమిటీ చేస్తున్న పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్ హాజరై సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటం చేస్తే ఏ సమస్య అయినా పరిష్కారం కాక తప్పదని దళిత బంధు సాధన కోసం పోరాట రూపాన్ని ఎంచుకున్న కమిటీ నాయకత్వానికి విప్లవ అభినందనలు తెలియజేశారు అనగారిన వర్గాల అభ్యున్నత కోసం అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దళిత బంధు పథకాన్ని ఏర్పాటు చేసిందని మొదటి దఫగా అర్హులను ఎంపిక చేసి దళిత బంధుని మంజూరు చేసిందని అన్నారు అనంతరం ఈ ప్రాంతంలోని ప్రజలు అందరికీ దళిత బందు వస్తుందని భావించి నమ్మారు మా జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డారు ఈ ఆశను అదునుగా చేసుకొని ప్రభుత్వ పదకమైన దళిత బందును ఇప్పిస్తామంటూ కొంతమంది ఈ నిరుపేదలైన దళితుల దగ్గర నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేసరికి ప్రభుత్వం మారేసరికి దళిత బంధు వస్తుందో రాదో అనేటువంటి భయాందోళనకి ప్రజలు గురయ్యారు రెక్కల కష్టంతో తిని తినక సంపాదించుకున్న డబ్బులను అప్పు సప్పు చేసి వడ్డీలకు తెచ్చిన డబ్బులను దళిత బందు కోసం వెచ్చించి మోసపోయామని బాధతో రాష్ట్రంలో అక్కడక్కడ దళిత బందు కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రభుత్వ పథకమైన దళిత బంధు పై డబ్బులు దండుకున్న విషయంపై తక్షణమే అధికారులు విచారణ జరిపి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలి తీసుకున్న డబ్బులను వారి నుంచి ప్రజలకు ఇప్పించాలి ఇలాంటి దందాలను పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు నూతన ప్రభుత్వంలో పరిపాలనలో దళితుల ఆశలు ఆకాంక్షలు మరింత చిగురించాలి తప్ప చిదిమి వేయకూడదని ప్రభుత్వానికి హితవు పలికారు ప్రభుత్వంపై దళితులకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు కచ్చితంగా ఇవ్వాలని తద్వారా దళిత సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరోసాని ఇవ్వాలని ప్రజల్లో ఉన్న భయాందోళనలను చెరిపి ఆత్మహత్యలను ఆపాలని దళితులకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాలని కోరారు లేనియెడల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఈ పోరాటానికి నిరంతరం అండగా ఉంటుందని భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత బందు సాధన కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు



తెలంగాణలో బయటపడుతున్న పలువురు ఐఏఎస్‌ల బాగోతం. మొన్న సోమేష్‌కుమార్, నిన్న అరవింద్‌కుమార్.. నేడు రజత్‌కుమార్ ఆస్తులపై వివాదం. మహబూబ్‌నగర్‌జిల్లా హేమాజీపూర్‌లో 52ఎకరాలు కొనుగోలు.. 15 ఎకరాలను ఇతరుల పేర్లు మీద మార్చడానికి.. స్లాట్ బుక్ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ రజత్‌కుమార్. వరుసగా పలువురు ఐఏఎస్‌లపై ఆరోపణలు.
మేడారం జాతరకు రండి..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై..
తిరుమల: 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,683 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,177 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు
ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ..
Feb 09 2024, 16:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.6k